ములుగు జిల్లాలో ఎస్‌ఐ ఆత్మహత్య.. సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని..

ములుగు జిల్లా వాజేడు ఎస్‌ఐ హరీష్‌ సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

By అంజి  Published on  2 Dec 2024 10:43 AM IST
Mulugu District, Wajedu SI, suicide, shooting, service revolver, Crime

ఎస్‌ఐ ఆత్మహత్య.. సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని.. 

ములుగు జిల్లా వాజేడు ఎస్‌ఐ హరీష్‌ సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ముళ్లకట్ట సమీపంలోని ఓ రిసార్ట్స్‌లో సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు. వ్యక్తిగత కారణాల వల్ల ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఎస్ఐ నిన్న రిసార్ట్స్‌లో గది అద్దెకు తీసుకున్నాడు. ఆ తర్వాత ఎవరు ఫోన్ చేసిన ఆయన అందుబాటులోకి రాలేదు. రిసార్ట్స్‌ సిబ్బంది ఎన్ని సార్లు డోర్ కొట్టినా తలుపు తెరవలేదు. దీంతో సోమవారం ఉదయం వాజేడు పోలీసులకు సిబ్బంది సమాచారం అందించారు. పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకున్న తర్వాత రిసార్ట్స్‌ సిబ్బంది డోర్ పగులగొట్టి చూడగా ఎస్ఐ విగతజీవిగా పడి ఉన్నారు.

నిన్న ఏడుగురు మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌ జరిగిన పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోనే ఈ ఘటన జరగడం కలకలం రేపుతోంది. గతంలో పేరూరు ఎస్‌ఐగా హరీశ్‌ విధులు నిర్వర్తిస్తున్న సమయంలో ఆ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఇన్ఫార్మర్స్‌ నెపంతో మావోయిస్టులు ఇద్దరిని చంపేశారు. అక్కడి నుంచి బదిలీపై వాజేడుకు వచ్చిన ఎస్‌ఐ సూసైడ్‌ చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

Next Story