పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగిని అవినీతి నిరోధక శాఖ అధికారులు సోమవారం పట్టుకున్నారు. కాంట్రాక్టర్ వెంకటేష్.. గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలో రూ.4.5 లక్షలతో శ్మశాన వాటికకు కాంపౌండ్ వాల్ నిర్మించాడు. ఈ క్రమంలోనే ఐడీఓసీలోని పంచాయత్ రాజ్ ఇంజినీరింగ్ విభాగంలో సీనియర్ అసిస్టెంట్ జోగినపల్లి భాస్కర్‌రావు.. శ్మశానవాటిక కాంపౌండ్‌వాల్ నిర్మాణ బిల్లును వేగవంతం చేయడానికి కాంట్రాక్టర్ వెంకటేశ్ నుంచి లంచం డిమాండ్ చేశాడు.
బిల్లును చీఫ్ ప్లానింగ్ అధికారికి పంపేందుకు భాస్కర్‌రావు లంచం డిమాండ్ చేశాడు. దీంతో కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించాడు. భాస్కర్ రావు రూ.7వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. డబ్బు రికవరీ చేయబడింది. రసాయన పరీక్షలు భాస్కర్ రావు ప్రమేయాన్ని నిర్ధారించాయి. అతన్ని అరెస్టు చేసి కరీంనగర్‌లోని SPE & ACB కేసుల ప్రత్యేక న్యాయమూర్తి ముందు ఏసీబీ హాజరుపరిచింది. పౌరులు లంచం గురించి టోల్ ఫ్రీ నంబర్ 1064 ద్వారా ఏసీబీకి రిపోర్ట్ చేయవచ్చు.
ఇదిలా ఉంటే.. రంగారెడ్డి జిల్లా నానాజ్‌పూర్ గ్రామానికి చెందిన పంచాయతీ కార్యదర్శి అధికా రెడ్డి, బిల్ కలెక్టర్ శ్రీ బాల్‌రాజ్ ఇంటి నంబర్ కేటాయింపు, కాంపౌండ్ వాల్ నిర్మాణ అనుమతి కోసం రూ.35,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు.
హన్మకొండ జిల్లా, కమలాపూర్ మండలానికి చెందిన ఒక రైతు తన తండ్రి తనకు బహూకరించిన భూమి రిజిస్ట్రేషన్ కోసం వెళ్ళగా తహశీల్దార్ & జాయింట్ సబ్ రిజిస్ట్రార్ పాలకుర్తి మాధవి 20 వేలరూపాయలు డిమాండ్ చేసింది. ఇందులో భాగంగా ఆ తహసీల్దార్ ఆదేశానుసారంగా తమ కార్యాలయములో ధరణి సైట్ ఆపరేటర్ గా పనిచేసే రాకేశ్ 5 వేల రూపాయలు లంచంగా తీసుకుంటుండగా వల పన్ని ఇద్దరిని (ఆపరేటర్ & తహశీల్దార్) ఏసిబి అధికారులు పట్టుకున్నారు.