బీజేపీ కార్యకర్త ఆత్మహత్య కేసులో పువ్వాడ అజయ్ 'A1' నిందితుడు : రేణుకా చౌదరి

MP Renuka Chowdary Fire On Govt. రాష్ట్రంలో ప్రోటోకాల్ లేదు.. ప్రొసీజర్ లేదని కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి మండిప‌డ్డారు.

By Medi Samrat  Published on  19 April 2022 10:00 AM GMT
బీజేపీ కార్యకర్త ఆత్మహత్య కేసులో పువ్వాడ అజయ్ A1 నిందితుడు : రేణుకా చౌదరి

రాష్ట్రంలో ప్రోటోకాల్ లేదు.. ప్రొసీజర్ లేదని కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి మండిప‌డ్డారు. గవర్నర్ నక్సల్ ప్రభావిత ప్రాంతాలలోకి వెళ్తే సెక్యూరిటీ కూడా ఉండదా..? అని రాష్ట్ర‌ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించారు. ఐఏఎస్.. ఐపీఎస్ లకు రాజకీయాలకు ఏం సంబందం.. అధికారులు రావాలి కదా..!? అని నిల‌దీశారు. గవర్నర్ రాజ్యాంగ వ్యవస్థలో గౌరవ ప్రద హోదా.. ఇదేనా పరిపాలనా విధానం అని ప్ర‌శ్నించారు. ఖమ్మంలో పీడీ యాక్టు పెట్టి వేధిస్తున్నారు.. కోర్టు ఆదేశాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదు.. ఏసీపీ.. తప్పుడు స్టేట్ మెంట్ లు ఇస్తున్నారని రేణుకా చౌదరి అన్నారు.

పువ్వాడ అజయ్ బీజేపీ కార్యకర్త ఆత్మహత్య కేసులో A 1 నిందితుడని ఆరోపించారు. పోలీస్ స్టేషన్ లో ఆత్మహత్య చేసుకుంటే ఏసీపీకి సంబందం లేదా..? అని ప్ర‌శ్నించారు. ఏసీపీ కూడా.. ఈ ఆత్మహత్య కేసులో నిందితుడే అని తీవ్రస్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. అమిత్ షా కనీసం స్పందించి కేసులు పెట్టించాల‌ని కోరారు. మా పార్టీ కార్యకర్తలనే కాదు.. మీ కార్యకర్తల ఆత్మహత్య చేసుకుంటే కూడా చర్యలు తీసుకోరా..? అని ప్ర‌శ్నించారు. పొత్తుల కోసం మేము అంతా ఇంట్రెస్ట్ గా ఏం లేమని.. కార్యకర్తలు కూడా టీఆర్ఎస్ తో కలిసి పని చేసేందుకు సిద్దంగా లేరని ఆమె వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ మాకు ఎంత దూరం ఉంటే అంత మంచిదని అన్నారు.

పువ్వాడకు.. కేటీఆర్ కు వ్యాపార సంబంధాలు ఉన్నాయని.. పువ్వాడ మీద ఎందుకు చర్యలు తీసుకోరని ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించారు. మహిళా గవర్నర్ మీద అసభ్యంగా పోస్టులు పెట్టడం మొగతనం కాదు.. కుసంస్కారంతో చేస్తున్న పనులని మండిప‌డ్డారు. ఏ మహిళ గురించైనా ఏ పార్టీ నాయకులు మాట్లాడినా ఊరుకునేది లేదని రేణుకా చౌదరి అన్నారు.

అమరావతి కాదు కమ్మ రావతి అన్నాడో సీఎం, పెట్టు ఆ పేరు చూద్దామ‌ని స‌వాల్ విసిరారు. కమ్మ సామాజిక వర్గం నీ అన్ని చోట్ల తొక్కేస్తున్నరు. మీకు అన్నిటికీ కమ్మల అవసరం ఉంది.. తర్వాత తొక్కేస్తున్నారని ఏపీ రాజ‌కీయాల‌పై స్పందిస్తూ అన్నారు.
















Next Story