పదేళ్ల పాటు సీఎం ఆయ‌నే : ఎంపీ మల్లు రవి

రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు డైట్, కాస్మొటిక్ చార్జీలు పెంచుతూ తీసుకున్న నిర్ణయం ఒక విప్లవాత్మకమైనదని ఎంపీ మల్లు రవి అన్నారు.

By Kalasani Durgapraveen  Published on  2 Nov 2024 1:08 PM IST
పదేళ్ల పాటు సీఎం ఆయ‌నే : ఎంపీ మల్లు రవి

రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు డైట్, కాస్మొటిక్ చార్జీలు పెంచుతూ తీసుకున్న నిర్ణయం ఒక విప్లవాత్మకమైనదని ఎంపీ మల్లు రవి అన్నారు. డైట్, కాస్మొటిక్ చార్జీలను 40 శాతం పెంచుతూ సీఎం రేవంత్ రెడ్డి దీపావళి పండుగ సందర్భంగా చేసిన ప్రకటన 7 లక్షల మంది విద్యార్థుల జీవితాలలో వెలుగు నింపుతుందన్నారు. ఏళ్ల తరబడి విద్యార్థులు చాలి చాలని మెస్ ఛార్జీలతో పౌష్టికాహారం లేక అనేక అనారోగ్య పరిస్థితులు ఎదుర్కొన్నారన్నారు. మెస్ చార్జీల పెంపు ఆషామాషీ గా తీసుకునే చిన్న వ్యవహారం కాదు.. 7 లక్షల మందికి ఒక అబ్దుతమైన భవిష్యత్ ను అందించే ఒక గొప్ప కార్యక్రమం అన్నారు.

దీని వల్ల విద్యార్థులలో చదువుకోవాలని కోరిక ఉత్సహం పెరుగుతుందన్నారు. ఎస్సి, ఎస్టీ, బిసి, మహిళ, మైనారిటీ, మహిళ హాస్టల్ లో ఈ చార్జీల పెంపు ఒక కొత్త ఉత్సహానికి అంకురార్పణ చేస్తుందన్నారు. ఇది సమాజం అంత పండుగ చేసుకోవాల్సిన సమయం అన్నారు. ఆర్థికంగా ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులలో ఉన్న కూడా ఎక్కడా కూడా వెనుకాడకుండా రేవంత్ రెడ్డి, మంత్రులు తీసుకున్న నిర్ణయం ఒక గొప్ప ఆలోచనకు నాంది అన్నారు. ఇది ప్రభుత్వం చేసే వ్యయంగా కాకుండా భావి తరాల అబ్దుతమైన భవిష్యత్ కోసం పెట్టె పెట్టుబడి లాగా ఈ ప్రజా పాలన ప్రభుత్వం భావిస్తోందన్నారు.

బీజేపీ శాసన సభ పక్షం నాయకులు మహేశ్వర్ రెడ్డి పూర్తిగా మతిలేని రెడ్డి లాగా మారిపోయిండని మల్లు రవి అన్నారు. ఆయన నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద, సీఎం రేవంత్ రెడ్డి మీద చేసిన వ్యాఖ్యలు ఆయన అవగాహన లేమి రాజకీయ అజ్ఞానానికి పరాకాష్ట అన్నారు. ఆయనకు బీజేపీలో ఏమి పని లేక పగటి కలలు కంటూ ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారన్నారు. బీజేపీ లో రోజు రోజుకు ముదిరిపోతున్న విభేదాలు.. వర్గ పోరు నుంచి దృష్గి మరల్చేందుకు ఇలాంటి జాతకాలు చెప్తున్నారన్నారు. ముఖ్యమంత్రి గా రేవంత్ రెడ్డి ఈ దఫా నే కాదు రాబోయే ఐదేళ్ళు అంటే పదేళ్ల పాటు సీఎం గా కొనసాగుతారన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి పదవికి కౌంట్ డౌన్ మొదలైందని బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు. త్వరలో తెలంగాణకు కొత్త సీఎం రావొచ్చని.. వచ్చే ఏడాది జూన్ నుంచి డిసెంబర్ మధ్య ఎప్పుడైనా ఇది జరగొచ్చని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్ లో మహేశ్వర్​రెడ్డి మీడియాతో చిట్ చాట్‌లో ఈ వ్యాఖ్య‌లు చేశారు.


Next Story