బోడ అమృత వర్షిణి.. ఎంతో మందికి ఆదర్శం.. చేయూత‌నిచ్చిన ఎంపీ

MP Komatireddy Venkat Reddy Helps Boda Amrutha. ఏదైనా సాధించాలనే మనో ధైర్యం ఉండాలే కానీ.. ఎటువంటి అవరోధాలు కూడా మన

By Medi Samrat  Published on  1 Jan 2022 8:11 AM GMT
బోడ అమృత వర్షిణి.. ఎంతో మందికి ఆదర్శం.. చేయూత‌నిచ్చిన ఎంపీ

ఏదైనా సాధించాలనే మనో ధైర్యం ఉండాలే కానీ.. ఎటువంటి అవరోధాలు కూడా మన ఎదుగుదలను ఆపలేవు. అలాంటి ట్యాలెంట్ ఉన్న యువతి బోడ అమృత వర్షిణి. ఇప్పుడు ఆమె ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది. తన తండ్రి ఆటో డ్రైవర్ అయినా.. తాను మాత్రం ఆకాశంలో ఎగరాలని అనుకుంది. అనుకుందే తడవుగా ఏవియేషన్ విభాగంలో రాణించాలని అనుకుంది. ఇప్పుడు ఆమె ట్రైనీ పైలట్‌గా అవకాశాన్ని అందుకుంది. అయితే ఇలాంటి సమయంలో ఆమెను ఆదుకోడానికి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ముందుకు వచ్చారు.

బోడ అమృత వర్షిణి నల్గొండకు చెందిన యువతి. ఆమె తండ్రి ఆటో డ్రైవర్. తెలంగాణ ఏవియేషన్ అకాడమీలో ట్రైనీ పైలట్‌గా ప్రవేశం పొందింది. తన కెరీర్‌ను కొనసాగించేందుకు ఆర్థిక సహాయం కోసం ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డిని సంప్రదించింది. అందుకు ఆయన పెద్ద మనసుతో ఓకే చెప్పారు. ఆమె చదువుకు అయ్యే ఖర్చు మొత్తం తానే భరిస్తానని హామీ ఇచ్చారు. ప్రస్తుతానికైతే రూ. 2 లక్షల చెక్ ఇచ్చారు. దురదృష్టవశాత్తు తెలంగాణ ప్రభుత్వం పేద విద్యార్థులకు సహాయం చేయడానికి ఎటువంటి పథకం పెట్టలేదని విమర్శలు గుప్పించారు. సహాయం కోసం ఆమె అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నేతలను సంప్రదించినా.. ఎవరూ స్పందించలేదని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి. ప్రజాప్రతినిధిగా నేను నా బాధ్యతను నిర్వర్తించానని.. ఆటోడ్రైవర్‌ కూతురు పైలట్‌ కావడం చూసి గర్వపడుతున్నానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. తనకు సహాయం చేసిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డికి కృతజ్ఞతలు చెప్పుకుంది బోడ అమృత వర్షిణి.


Next Story
Share it