కవిత బిజినెస్ పార్ట్‌న‌ర్‌ ఎవరో చెప్పిన ధర్మపురి అరవింద్

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కేసీఆర్ కంటే ఎక్కువగా భూములను రేవంత్ అమ్ముతారని

By Medi Samrat  Published on  21 Nov 2023 12:45 PM GMT
కవిత బిజినెస్ పార్ట్‌న‌ర్‌ ఎవరో చెప్పిన ధర్మపురి అరవింద్

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కేసీఆర్ కంటే ఎక్కువగా భూములను రేవంత్ అమ్ముతారని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కవిత బిజినెస్ పార్ట్‌నర్ రేవంత్ రెడ్డి అని ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబం కారాగారంలోకి వెళ్లడం ఖాయమన్నారు. ఇకపై జీవితంలో ఎన్నడూ కవిత ఎన్నికల్లో నిలబడదని, నిలబడినా గెలవదన్నారు. రేవంత్ రెడ్డిని కేసీఆర్ జైలుకు ఎందుకు పంపడం లేదని ప్రశ్నించారు.

మంగళవారం నాడు బోధన్‌లో యువశక్తి విజయ సంకల్ప సభలో ఎంపీ ధర్మపురి పాల్గొని మాట్లాడుతూ.. నిజాం ఫ్యాక్టరీని ముంచింది కాంగ్రెస్‌. చరిత్రాత్మక షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ కావాలంటే బీజేపీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలన్నారు. కాంగ్రెస్ కర్ణాటకలో ప్రజలను మోసం చేసింది.. ఇక్కడ కూడా మోసం చేయాలని అనుకుంటూ ఉందన్నారు. ఐదు వందల కోట్లతో నిజామాబాద్‌లో ఆస్పత్రి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

Next Story