ఎంపీ ధర్మపురి అరవింద్ కాన్వాయ్ పై దాడి
MP Dharmapuri Aravind convoy attacked. బీజేపీ ఎంపీ అరవింద్ కాన్వాయ్‌పై టీఆర్‌ఎస్ కార్యకర్తలు దాడి చేశారు.
By Medi Samrat Published on 15 July 2022 11:23 AM GMT
బీజేపీ ఎంపీ అరవింద్ కాన్వాయ్‌పై టీఆర్‌ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. ఈ దాడిలో ఆయన కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. శుక్రవారం జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్రదండి గ్రామంలో ముంపుకు గురైన ప్రాంతాలను పరిశీలించేందుకు వచ్చిన ఎంపీని గ్రామస్తులు అడ్డుకున్నారు. ఓట్ల కోసం చేతులు జోడించి మొక్కే బూటకపు రాజకీయ నాయకులు ఈ గ్రామంలోకీ రావద్దనీ ఎంపీకీ వ్యతిరేకంగా నినాదాలు చేస్తు గంట పాటు బైఠాయించారు. ఎంపీ కారుపై రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఆయన కారు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
ఈ ఘటనపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పై ప్రజలు తిరగబడే సమయం ఆసన్నమైందని, సహనాన్ని పరీక్షించవద్దన్నారు. తెలంగాణలోని టీఆరెఎస్ ఎమ్మెల్యేలంతా దోపిడిదారులుగా తయారయ్యాయరని, ఏమైనా అంటే బీజేపీ వాళ్ల కార్ల అద్దాలు పలగొడ్తామని, రాళ్లు విసురుతామంటున్నారని అన్నారు. ఎర్దండి గ్రామం గోదావరి వరదలతో ముంపునకు గురైందని.. నష్టపోయిన ప్రాంతాన్ని సందర్శించేందుకు వెల్తుండగా 10 మంది టీఆరెఎస్ వాళ్లు అడ్డుకున్నారన్నారు. గ్రామానికి చెందిన వారికి 465 పట్టాలు 30 ఏళ్ల క్రితం ఇచ్చారని, ముంపునకు గురి కాని ప్రాంతంలోని స్థలాన్ని కేటాయించారన్నారు. బీజేపీ నేత సీ హెచ్ విద్యాసాగర్ హయాంలో 104 సర్వే నెంబర్‌లో 70 ఎకరాల భూమిలో 30 ఎకరాల్లో పట్టాలు ఇవ్వగా, నిర్మల్ ప్రాంతంలో ఎస్సారెస్పీ ద్వారా ముంపునకు గురైన ఆరుగురికి 27 ఎకరాలు ఇచ్చారని తెలిపారు.