మూసీ ప్రక్షాళన అవసరం.. సహకరించండి : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడమే లక్ష్యంగా బీజేపీ ప్రవర్తిస్తుందన్ని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.

By Kalasani Durgapraveen
Published on : 16 Nov 2024 11:30 AM IST

మూసీ ప్రక్షాళన అవసరం.. సహకరించండి : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేపట్టిన మూసి నిద్ర కార్యక్రమం పై భువనగిరి పార్లమెంట్ సభ్యులు కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ వేశారు. ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడమే లక్ష్యంగా బీజేపీ ప్రవర్తిస్తుందన్ని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే మూసి పరివాహక ప్రాంతంలో నిద్రించి.. వారితో భోజనం చేసి, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకుని వస్తే తప్పులేదన్నారు. కేవలం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న.. మూసి ప్రక్షాళనను అడ్డుకోవడమే లక్ష్యంగా వెళ్లడం తప్పు అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సబర్మతి రివర్ ఫ్రంట్ గాని, గంగా రివర్ ఫ్రంట్ గాని ప్రక్షాళన చేసినప్పుడు మీరు ఎలాగైతే సహకరించారో.. మూసి ప్రక్షాళనకు కూడా సహకరించాలని కోరారు. దక్షిణ భారతదేశన్ని కూడా గుజరాత్ మోడల్ లాగా మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దీనికి రాజకీయాలకు అతీతంగా అందరూ సహకరించాలన్నారు. మిమ్ములను ఓట్లేసి గెలిపించిన ప్రజల కోసం మీరు పని చేయాల్సిన అవసరం ఉందన్నారు.

హైదరాబాద్ నడిబొడ్డు నుండి ప్రవహిస్తున్న మూసీ నది ప్రక్షాళన అవసరం అన్నారు. మూసి ప్రక్షాళనను రాజకీయం చేయకుండా.. గంగా నది, సబర్మతి నది ప్రక్షాళన కోసం మోడీ కి సహకరించిన విధంగానే ఇక్కడ మూసీ నదికి కూడా సహకరించి ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం పాటుపడాలన్నారు.

Next Story