కౌశిక్ రెడ్డి ఓ సూసైడ్ స్టార్ : ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్
కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ..
By Medi Samrat Published on 25 Oct 2024 6:50 PM ISTకాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒక ఆంబోతును వదిలేసినట్లు బీఆర్ఎస్ కౌశిక్ రెడ్డిని వదిలేసింది.. కౌశిక్ రెడ్డి ఒక సూసైడ్ స్టార్.. మీడియాలో కనిపించడానికి ఇష్టం వచిన్నట్లు మాట్లాడుతున్నాడని అన్నారు.
ఆ రోజు బీఆర్ఎస్‌లో ఎమ్మెల్సీ గా ఉన్నప్పుడు నువ్వేం మాట్లాడినవ్.. హుజురాబాద్ లో ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ అడిగినప్పుడు.. అక్రమంగా కేసులు పెట్టించినప్పుడు ఏమైంది.. ఒక మహిళా అధికారిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడింది మర్చిపోయావా..? అని ప్రశ్నించారు. ఒక సర్పంచ్ కుటుంబానికి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ.20 లక్షలు తీసుకొని ఉద్యోగం పెట్టించలేదు. ఆ 20లక్షలు రిటర్న్ అడిగితే కేసు పెట్టించింది ఎవరో మర్చిపోయావా కౌశిక్ అని నిలదీశారు. బిజిగిరి షరీఫ్ లో ఒక రిటైర్డ్ ఎంప్లాయ్ వద్ద ఒక పంచాయితీ కోసం రూ.20 లక్షలు తీసుకొని మోసం చేసింది మర్చిపోయావా.. అలాగే వీణవంకలో ఒకరికి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ.20 లక్షలు తీసుకొని మోసం చేసింది మర్చిపోయావా.. ఇవన్ని మర్చిపోయి నేను ఏమి తప్పు చేయలేదు, నీతిమంతుడినని అన్నట్లు మాట్లాడుతున్నావా అని ఎద్దేవా చేశారు.
నేను పుట్టిందే బీఆర్ఎస్‌లో, బీఆర్ఎస్ కోసమే పుట్టినట్లు మాట్లాడానికి సిగ్గు లేదా అని ఫైరయ్యారు. కాంగ్రెస్ పార్టీలో ఒక కొవర్టులా పని చేసినా.. నన్ను పార్టీ నుండి సస్పెండ్ చేశారు. మీరే నాకు దిక్కు కేటీఆర్ అని వాళ్ల కాళ్ళు మొక్కి బీఆర్ఎస్ లో ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్నావు.. ఆ రోజు గవర్నర్ ఎమ్మెల్సీని తిరస్కరిస్తే.. మహిళా అని చూడకుండా ఇష్టం వచ్చిన్నట్లు తిట్టినావు.. పార్టీ ఫిరయింపుల గురించి మాట్లాడానికి సిగ్గు ఉండాలని అన్నారు. గతంలో తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను టీడీపీ నుండి బీఆర్ఎస్‌లో తీసుకొని మంత్రి ఇచ్చారు.. దీనికి ఎవరు సమాధానం చెప్తారు నువ్వా.. నీ బాస్ నా..? అని ప్రశ్నించారు.
కేటీఆర్.. ఆదిలాబాద్ సభలో కాంగ్రెస్ నాయకుల గురించి లుచ్చా గాళ్ళని మాట్లాడినావు. కాంగ్రెస్ నాయకుల గురించి, కార్యకర్తల గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే గుడ్డలూడ దీసి కొడుతామని హెచ్చరించారు. మంత్రిగా చేసినావు.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నావు ఎలా మాట్లాడాలో ముందుగా తెలుసుకో కేటీఆర్ అని హితువు పలికారు.
కౌశిక్ నువ్వు మోసం చేసిన ప్రతి ఒక్కరికీ రూపాయితో సహా తిరిగి ఇప్పిస్తామన్నారు. నువ్వు చేసిన తప్పులకు ఆధారాలతో సహా కేసులు పెట్టిస్తామన్నారు. ప్రజా ప్రభుత్వం ప్రజలకు చేసిన దాని గురించి బహిరంగ చర్చకు నేను సిద్ధం.. కేటీఆర్ మీరు చర్చకు సిద్దమైతే రండి చర్చిద్దాం అని సవాల్ విసిరారు.