తొక్కిసలాటలో సామాన్యురాలు ప్రాణాలు కోల్పోయింది. ఆమె కొడుకు చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నారు.. చట్టం ముందు అందరూ సమానమే అని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అల్లు అర్జున్ అరెస్ట్‌పై స్పందించారు. చట్టానికి ఎవరు అతీతులు కాదని.. అల్లు అర్జున్ మామ మా పార్టీకి చెందిన నాయకుడే.. సీఎం రేవంత్ కి అల్లు అర్జున్ కుటుంబంతో బంధుత్వం ఉందన్నారు. తెలుగు చిత్ర సీమకి, కాంగ్రెస్ పార్టీకి విడదీయరాని బంధం ఉందన్నారు. ఫిల్మ్ స్టూడియోలు కట్టుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం భూములు ఇచ్చి వెసులుబాటు కల్పించడం వల్లే చిత్ర సీమ మద్రాస్ నుంచి హైదరాబాద్ కి వచ్చిందన్నారు. చరిత్ర తెలుసుకొని బీజేపీ నేతలు మాట్లాడాలన్నారు.
బీఆర్ఎస్ నేతలు రౌండ్ టేబుల్ సమావేశం ఎందుకు పెడుతున్నారో సమాధానం చెప్పాలన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసిందన్నారు. పదేళ్లలో కేసిఆర్, కవిత, హరీష్, కేటీఆర్ తెలంగాణ విగ్రహం మీద ధ్యాస ఎందుకు లేదు? అని ప్రశ్నించారు. ఈ కార్ రేసింగ్ స్కాం లో నిధుల గోల్ మాల్ జరిగినట్లు అధికారులు గుర్తించారు.. రేసింగ్ స్కాం లో కేటీఆర్ అక్రమాలకు పాల్పడినట్లు తేలితే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయన్నారు.