నిబంధనల ప్రకారమే గెస్ట్‌ హౌస్‌.. తప్పని తేలితే కూల్చేయండి: ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి

గవర్నమెంట్‌ రూల్స్‌ ప్రకారమే గెస్ట్‌ హౌస్‌ నిర్మించుకున్నానని మాజీమంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌ రెడ్డి తెలిపారు.

By అంజి  Published on  27 Aug 2024 6:59 AM GMT
MLC Mahender Reddy, guest hous, occupying pond, Telangana, Hyderabad

నిబంధనల ప్రకారమే గెస్ట్‌ హౌస్‌.. తప్పని తేలితే కూల్చేయండి: ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి

హైదరాబాద్‌: గవర్నమెంట్‌ రూల్స్‌ ప్రకారమే గెస్ట్‌ హౌస్‌ నిర్మించుకున్నానని మాజీమంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌ రెడ్డి తెలిపారు. హిమాయత్‌సాగర్‌లో నిర్మించిన గెస్ట్‌ హౌస్‌పై మహేందర్‌ రెడ్డి వివరణ ఇచ్చారు. చెరువులను ఆక్రమించి కట్టిన నిర్మాణాలను కూల్చివేస్తున్న హైడ్రాకు మద్ధతు తెలిపారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతను సమర్థించారు. తాను ఎలాంటి చెరువు భూమి ఆక్రమించి ఇల్లు కట్టుకోలేదన్నారు. నిబంధనల ప్రకారం లేదని తేలితే తానే కూల్చివేస్తానన్నారు.

''కేటీఆర్‌కు వాస్తవాలు తెలియక ఉద్దేశ్యపూర్వకంగా నాపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని, కొత్వాల్‌గూడలో నా భవనాలు నిబంధనల ప్రకారం పట్టా భూమిలో నిర్మించారని, నా భవనాలు అక్రమ నిర్మాణాలైతే అధికారులకు సహకరించి కూల్చివేయాలని కోరతా" అని ఎమ్మెల్సీ మహేందర్‌ రెడ్డి అన్నారు. 111 జీవో పరిధిలో చాలా మంది మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇళ్లు నిర్మించుకున్నారని తెలిపారు. ప్రభుత్వం పర్మిషన్‌ ఇస్తేనే ఇల్లు నిర్మించుకున్నామని మహేందర్‌ రెడ్డి తెలిపారు.

''నా గెస్ట్‌ హౌస్‌ ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లో ఉంటే కూల్చేయమని చెప్తున్నా. పట్టాభూమిలోనే నా గెస్ట్‌ హౌస్‌ ఉంది. అక్కడికి దగ్గర్లోనే చాలా ఫంక్షన్‌ హాళ్లు ఉన్నాయి. పూర్తి వివరాలు తెలియకుండా కేటీఆర్‌ మాట్లాడారని భావిస్తున్నా'' అని అన్నారు.

Next Story