అదానీకో న్యాయం.. ఆడబిడ్డకో న్యాయమా.? : ఎమ్మెల్సీ కవిత సంచలన ట్వీట్

అదానీ వ్యవహారంపై BRS నేత, ఎమ్మెల్సీ కవిత సంచలన ట్వీట్ చేశారు.

By Medi Samrat  Published on  21 Nov 2024 4:49 PM IST
అదానీకో న్యాయం.. ఆడబిడ్డకో న్యాయమా.? : ఎమ్మెల్సీ కవిత సంచలన ట్వీట్

అదానీ వ్యవహారంపై BRS నేత, ఎమ్మెల్సీ కవిత సంచలన ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌లో బీజేపీ, ప్రధాని మోదీపై కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. జైలు నుంచి విడుదల అయ్యాక కవిత తొలిసారి రాజకీయ ప‌ర‌మైన‌ వ్యాఖ్యలు చేశారు. ఈ ట్వీట్‌లో ఎన్ని సార్లు ఎన్ని ఆరోపణలు వచ్చినా ప్రధాని అదానీ వైపేనా ?? అని ప్రశ్నించారు.

ఆమె ట్వీట్‌లో.. అఖండ భారతంలో అదానికో న్యాయం.. ఆడబిడ్డకో న్యాయమా.? ఆధారాలు లేకున్నా ఆడబిడ్డను కాబట్టి అరెస్ట్ చేయడం ఈజీ.. ఆధారాలు ఉన్నా అదానీను అరెస్ట్ చేయడం మాత్రం కష్టమా. ఎన్ని సార్లు ఆరోపణలు వచ్చినా ప్రధాని అదానీ వైపేనా.?? అని ప్ర‌శ్నించారు. ఈ ట్వీట్ ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది. బీఆర్ఎస్ శ్రేణులు, క‌విత అభిమానులు లైక్‌లు, కామెంట్ల‌లు, రీట్వీట్ల‌తో హోరెత్తిస్తున్నారు.


Next Story