బీఆర్ఎస్, కేసీఆర్, క్రైస్తవులకు పేగుబంధం ఉంది : ఎమ్మెల్సీ కవిత
కాంగ్రెస్ పాలనలో క్రిస్మస్ గిఫ్ట్, రంజాన్ తోఫా, బతుకమ్మ చీరల పంపిణీ ఎగిరిపోయాయని..
By Medi Samrat Published on 25 Dec 2024 6:18 PM ISTకాంగ్రెస్ పాలనలో క్రిస్మస్ గిఫ్ట్, రంజాన్ తోఫా, బతుకమ్మ చీరల పంపిణీ ఎగిరిపోయాయని.. మహిళలకు నెలకు 2500 ఇస్తామని సీఎం ప్రకటిస్తారని మహిళలకు ఆశించారు.. కళ్యాణ లక్ష్మీతో పాటు తులం బంగారం ఇస్తామని ప్రకటన చేస్తారని ప్రశ్నలు ఆశించారు.. కానీ ప్రభుత్వం ఎటువంటి ఆలోచన చేయడం లేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మెదక్ చర్చిని సందర్శించిన అనంతరం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఒక్కో ఆడబిడ్డకు ప్రభుత్వం 30 వేలు బాకీ పడింది.. 18 ఏళ్లు నిండిన ఆడపిల్లలకు స్కూటీ ఇవ్వలేదు.. తక్షణమే స్కూటీల పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టాలని డిమాండ్ చేశారు.
మహిళలను నమ్మించి మోసం చేసిన రేవంత్ రెడ్డి సర్కార్.. కేసీఆర్ కిట్ పథకాన్ని నిలిపివేయడం చేయకపోవడం దారుణం అన్నారు. రాష్ట్రంలో 40 శాతం నేరాలు పెరిగాయి. నేరాల రేటు పెరగడం, ప్రభుత్వం మహిళల పట్ల చూపిస్తున్న నిర్లక్ష్యానికి నిదర్శనం అన్నారు. మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేసే సోయి ప్రభుత్వానికి లేదన్నారు. మహిళలు చూస్తూ ఊరుకోబోరు.. ఖచ్చితంగా ప్రశ్నిస్తారు.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధును ఎగ్గొట్టిందన్నారు. తక్షణమే రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలన్నారు.
రైతు భరోసా కింద అర్హులను తగ్గించే ప్రయత్నం చేయవద్దు.. కేంద్ర ప్రభుత్వపు నిబంధలను అమలు చేస్తే 30 శాతం రైతులకు కూడా రైతు భరోసా రాదు అన్నారు. ధన్యానికి బోనస్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు కేవలం సన్న వడ్లకే పరిమితం చేసిందన్నారు. మాట మార్చడం తప్ప ప్రభుత్వంలో ఏం కనిపించడం లేదన్నారు. మొక్కజొన్నలు, కందులు, సోయాబీన్, పత్తి వంటి పంటలను మద్ధతు ధరను పెంచుతామని ఇచ్చిన హామీ ఏమైంది.? అని ప్రశ్నించారు. ఏడాది కాలంగా ఏ ఒక్క పంటకు మద్ధతు ధర ఇవ్వడం లేదు.. చెక్కర ఫ్యాక్టరీలను ఎప్పుడు తెరిపిస్తారు.? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా రేషన్ కార్డులు ఇవ్వలేదు.. ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి రేషన్ బియ్యం పంపిణీ చేయాల్సిందేనన్నారు. తక్షణమే రేషన్ కార్డులు, రైతు భరోసా ఇవ్వాలన్నారు.
తెలంగాణకు తలమానికం మెదక్ చర్చి.. బీఆర్ఎస్‌కు, కేసీఆర్‌కు, క్రైస్తవులకు పేగుబంధం ఉందన్నారు. తెలంగాణ కోసం ప్రార్థన చేయని చర్చి లేదన్నారు. మత సహనానికి నిదర్శనం మెదక్.. మెదక్ జిల్లాను కేసీఆర్ ఎంతో అభివృద్ధి చేశారన్నారు. కేసీఆర్ గోదావరి జలాలతో సింగూరును నింపారన్నారు. మెదక్ కు నీళ్లు వచ్చే కాళేశ్వరం ప్యాకేజీ 19 పనులను ప్రభుత్వం నిలిపివేడయం దారుణం అన్నారు. కేసీఆర్ పై కోపాన్ని మెదక్ ప్రజలపై తీర్చుకుంటే ఏమొస్తుంది.? కాళేశ్వరం ప్యాకేజీ 19 పనులను కొనసాగించాలన్నారు.