తెలంగాణ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha Ugadi greetings to the people of Telangana. తెలంగాణ ప్రజలకు ఎమ్మెల్సీ కవిత ఉగాది శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ సంద‌ర్భంగా ఆమె ప్రత్యేక సందేశం విడుద‌ల చేశారు.

By Medi Samrat  Published on  1 April 2022 12:30 PM GMT
తెలంగాణ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్సీ కవిత

తెలంగాణ ప్రజలకు ఎమ్మెల్సీ కవిత ఉగాది శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ సంద‌ర్భంగా ఆమె ప్రత్యేక సందేశం విడుద‌ల చేశారు. తెలంగాణ బిడ్డలందరికీ ఉగాది పండగ శుభాకాంక్షలు. శుభకృత్ నామ సంవత్సరంలో ప్రజలందరి జీవితాల్లో శుభాలను తీసుకురావాలని, మనందరం బాగుండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఉగాది పర్వదినాన "శతాయు వజ్రదేహాయ సర్వ సంపత్ కారాయచ.. సర్వార్రిష్ట వినాశాయ.. నింబకం దళ భక్షణమ్‌.. అంటూ పచ్చడి తాగుతాం. ఉగాది పచ్చడిలో ఉండే తీపి, చేదు, పులుపు, ఒగరు, కారం, ఉప్పు రుచులు ఉన్నట్టుగానే, జీవితంలోనూ కష్ట నష్టాలు, సుఖ దుఃఖాలు, అనేక కఠిన పరిస్థితులను ఎదుర్కోవాల్సిన సందర్భాలు వస్తుంటాయి. అన్ని పరిస్థితుల్లోనూ దేవుడు మీతో ఉండాలని, ప్రజలంతా ధైర్యంగా జీవితంలో ముందడుగు వేయాలని కోరుకుంటున్నాన‌ని అన్నారు.

తెలుగు వారంతా ఈ సంవత్సరాన్ని శుభకృత్ నామ సంవత్సరంగా జరుపుకుంటే.. తెలంగాణ యువత ఉద్యోగ నామ సంవత్సరంగా చేసుకుంటున్నారని భావిస్తున్నాను. సీఎం కేసీఆర్ 90 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తుండటంతో, యువత ప్రిపరేషన్ లో బిజీగా ఉన్నారు. పరీక్షలకు సిద్దమయ్యే యువత టీ- సాట్ ద్వారా టీవీల్లో, యూ ట్యూబ్ లో ఉచితంగా అందుబాటులో ఉండే ఎగ్జామ్స్ ప్రిపరేషన్ మెటీరియల్ ను ఉపయోగించుకుని, ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేలా పిల్లలను ప్రోత్సహించాలని ఆడబిడ్డలందరినీ కోరుతున్నానని.. తెలంగాణ ప్రజలందరికీ మరోసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.. జై తెలంగాణ అంటూ ముగించారు.


Next Story
Share it