ప్ర‌భుత్వ చిత్త‌శుద్ధికి అదే నిద‌ర్శ‌నం : ఎమ్మెల్సీ క‌విత‌

MLC Kavitha tweet on heavy rains.గ‌త వారం రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. జ‌లశ‌యాలు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 July 2022 6:55 AM GMT
ప్ర‌భుత్వ చిత్త‌శుద్ధికి అదే నిద‌ర్శ‌నం : ఎమ్మెల్సీ క‌విత‌

గ‌త వారం రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. జ‌లశ‌యాలు అన్ని దాదాపుగా నిండుకుండ‌ల‌ను త‌ల‌పిస్తున్నాయి. గ్లేట‌ను ఎత్తి నీటిని కింద‌కు విడుద‌ల చేస్తున్నారు. దీంతో వాగులు, వంక‌లు ఉదృతంగా ప్ర‌వ‌హిస్తున్నాయి. ఈ క్ర‌మంలో ఎమ్మెల్సీ క‌విత ట్వీట్ చేశారు.

తెలంగాణలో ఎన్నడూ లేనంతగా కురుస్తున్న భారీ వర్షాలతో ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా సీఎం కేసీఆర్ పటిష్ట చర్యలు తీసుకుంటున్నార‌ని, చెన్నూరు మండలం సోమన్‌పల్లి వద్ద గోదావరి నదిలో చిక్కుకున్న ఇద్దరిని ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా రక్షించడం రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్దికి నిదర్శనమ‌ని క‌విత ట్వీట్ చేశారు.

మ‌రో ట్వీట్‌లో విధి నిర్వహణకు వెళ్ళి, వరదల్లో కొట్టుకుపోయిన జగిత్యాలకు చెందిన జర్నలిస్టు జమీర్ మరణం అత్యంత బాధాకరం. జమీర్ కుటుంబానికి అండగా నిలుస్తామ‌ని క‌విత పేర్కొన్నారు. వార్తా సేకరణకు ప్రాధాన్యత ఇస్తూనే, వర్షాలు, వరదల పట్ల అప్రమత్తంగా ఉంటూ, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మీడియా మిత్రులను కోరుతున్న‌ట్లు క‌విత తెలిపారు.

Next Story
Share it