బీఆర్‌ఎస్ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేడు మీడియాతో మాట్లాడనున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో మధ్యాహ్నం 12 గంటలకు ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. అందులో ఎమ్మెల్సీ సభ్యత్వం రద్దు నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. బీఆర్‌ఎస్ నేతలపై ఆమె ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. కాళేశ్వరం అవినీతిపై మరిన్ని వివరాలు చెబుతారా, లేదంటే హరీశ్ రావును మరోసారి టార్గెట్ చేస్తారా అనేది చూడాలి.
ఇక నిన్న ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు బీఆర్‌ఎస్ ప్రకటించింది. ఆమె వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగిస్తున్నాయని సస్పెన్షన్ వేటు వేసినట్టు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రవీందర్ రావు ప్రకటన విడుదల చేశారు. కొంత కాలంగా కవిత పార్టీ వ్యతిరేక స్వరాన్ని వినిపిస్తున్న సంగతి తెలిసిందే. మొన్న ఏకంగా హరీశ్ రావుపైనే అవినీతి ఆరోపణలు చేశారు. హరీశ్, సంతోష్ రావులు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.