ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కరోనా

MLC Kavitha Tested For Covid Positive. నిజామాబాద్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

By Medi Samrat  Published on  12 Sep 2022 2:39 PM GMT
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కరోనా

నిజామాబాద్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. గత మూడు రోజులుగా స్వల్ప కరోనా లక్షణాలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో కరోనా పరీక్షలు చేయించుకోగా.. పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారంతా ముందు జాగ్రత్తగా కొవిడ్‌ పరీక్షలు చేయించుకోవాలని కవిత విజ్ఞప్తి చేశారు.

సోమ‌వారం సాయంత్రం ఆమె త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ల ద్వారా ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. స్వ‌ల్ప జ‌లుబు ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డంతో తాను క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకున్నాన‌ని, ఈ క్ర‌మంలో త‌న‌కు క‌రోనా సోకిన‌ట్లు తేలింద‌ని ఆమె వెల్ల‌డించారు. గ‌డ‌చిన రెండు రోజులుగా త‌న‌ను క‌లిసిన వారిలో ఎవ‌రికైనా జ్వ‌రం, జ‌లుబు ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే త‌క్ష‌ణ‌మే ఐసోలేష‌న్‌లోకి వెళ్లాల‌ని, క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు జ‌రిపించుకోవాల‌ని ఆమె కోరారు. క‌రోనా పాజిటివ్‌గా తేల‌డంతో తాను త‌న ఇంట్లోనే ఐసోలేష‌న్‌లో ఉంటూ వైద్య చికిత్స తీసుకుంటున్నాన‌ని ఆమె తెలిపారు.


Next Story
Share it