ఢిల్లీ లిక్కర్ స్కాంలో రెండు రోజులు వరుసగా ఈడీ విచారణ ఎదుర్కొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి వచ్చిన ఆమె అక్కడి నుంచి నేరుగా ప్రగతిభవన్‌కు వెళ్లారు. కవితతో పాటు మంత్రులు కేటీఆర్, హరీష్ రావుతో పాటు మరికొంతమంది పార్టీ నేతలు ఉన్నారు. ఆమె సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో విచారణ ఎదుర్కొంటున్న కవితను సోమ , మంగళవారం సుదీర్ఘంగా విచారించింది. రెండు రోజులు సుమారు 10 గంటల పాటు ఈడీ అధికారులు విచారించారు.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అసిస్టెంట్ డైరెక్టర్ జోగేందర్‌కు మంగళవారం బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల లేఖ రాశారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ దాఖలు చేసిన చార్జిషీటులో పది ఫోన్లు ధ్వంసం చేశారన్న ఆరోపణల నేపథ్యంలో మంగళవారం విచారణకు ఆయా ఫోన్లతో ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. ఫోన్ స్వాధీనం చేసుకోవడం, అదీ ఒక మహిళ దగ్గర నుంచి తీసుకోవడం గోప్యతకు భంగం కలిగించినట్లు కాదా అని కవిత ప్రశ్నించారు. తనని ప్రశ్నించకుండా ఇతరుల స్టేట్‌మెంట్లను బట్టి ఫోన్లు ధ్వంసం చేశానని ఎలా ఆరోపిస్తారని ప్రశ్నించారు.