మమతా బెనర్జీ గెలిచింది.. ప్రధాని మోదీ రాజీనామా చేస్తారా?
MLC Kavitha Fires On Bandi Sanjay. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు.
By Medi Samrat Published on
4 Oct 2021 6:44 AM GMT

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ విజయం ఖాయమని ఆమె అన్నారు. ప్రతి ఎన్నికకు సవాల్ చేయడం కరెక్ట్ కాదని కవిత అన్నారు. రాజకీయాల్లో ఎవరైనా హుందాగా వ్యవహరిస్తే బాగుంటుందని సూచించారు. రాజకీయాలను ప్రతిపక్షాలు ఎక్కడికి తీసుకెళ్తారో అర్థం కావడం లేదని అసహనం వ్యక్తం చేశారు.
కేసీఆర్ గెలిచినన్ని ఎన్నికలు ఎవ్వరూ గెలువలేదని కవిత అన్నారు. నిన్న బెంగాల్‌లో మమతా బెనర్జీ గెలిచింది.. ప్రధాని మోదీ రాజీనామా చేస్తారా? అని ప్రశ్నించారు. భవానీపూర్‌లో మమతా బెనర్జీ ఎన్నికను బీజేపీ ఛాలెంజ్ గా తీసుకుంది కదా?.. ఓడిపోతే రాజీనామా చేశారా.. బండి సంజయ్ మీడియాలో కనిపించేందుకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు.
Next Story