ఉచితాలను తీసేసేందుకు కేంద్రం కుట్ర : ఎమ్మెల్సీ క‌విత

MLC Kavitha comments Fires on BJP.కేంద్రంలోని బీజేపీ పై ఎమ్మెల్సీ క‌విత తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 Sep 2022 9:15 AM GMT
ఉచితాలను తీసేసేందుకు కేంద్రం కుట్ర : ఎమ్మెల్సీ క‌విత

కేంద్రంలోని భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ) పై ఎమ్మెల్సీ క‌విత తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. నిజామాబాద్‌లో కొత్త ఫించ‌న్ల పంపిణీ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే గ‌ణేష్ గుప్తాతో క‌లిసి క‌విత పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్సీ క‌విత మాట్లాడుతూ.. ప్ర‌జ‌ల‌కు ఉచితాలు వ‌ద్ద‌ని కేంద్ర ప్ర‌భుత్వం కుట్ర‌పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని విమ‌ర్శించారు.

ఫించ‌న్‌, రేష‌న్, షాదీ ముబార‌క్ వంటి ప‌థ‌కాలు ఇవ్వొద్ద‌ని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ అంటున్నారన్నారు. ప్ర‌ధాని మోదీ రూ.10లక్షల కోట్లు తన మిత్రులకు పంచిపెట్టారన్నారు. ఏదో ఒక కార‌ణంతో ప‌థ‌కాల‌ను అమ‌లు చేయ‌కుండా కుట్ర జ‌రుగుతోంద‌న్నారు. కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ఈ మ‌ధ్య నిజామాబాద్ జిల్లాకు వ‌చ్చారు. ఆర్థిక మంత్రి రేషన్ షాపులకు వెళ్లి మోదీ ఫొటోపై కలెక్టర్‌తో గొడవ పెట్టుకున్నారని తెలిపారు. రేష‌న్ దుకాణాల వ‌ద్ద మోదీ ఫోటోలు పెట్టాల్సిన అవ‌స‌రం ఉందా అని ప్ర‌శ్నించారు.? పెట్రోల్ బంకుల వ‌ద్ద యూరియూ బ‌స్తాల మీద ఖ‌చ్చితంగా మోదీ ఫోటోల‌ను పెడ‌తామ‌న్నారు.

ప‌క్క‌నే ఉన్న మ‌హారాష్ట్ర‌లో ప‌ప్పులు, పెట్రోల్‌, ఇత‌ర వ‌స్తువుల ధ‌ర‌లు ఎలా ఉన్నాయో మ‌నం గ‌మ‌నించాల‌ని చెప్పారు. అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడు ప్ర‌ధాని మోదీ తెలంగాణ ప్ర‌జ‌లు స‌రైన గుణ‌పాఠం చెబుతార‌ని, ఆ న‌మ్మ‌కం త‌న‌కు ఉంద‌ని క‌విత అన్నారు.

Next Story
Share it