ఆ కమిటీలను రద్దు చేస్తూ.. సంచలన నిర్ణయం తీసుకున్న కవిత
భారత్ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన నిర్ణయం తీసుకున్నారు.
By Medi Samrat Published on 10 March 2024 7:00 PM ISTభారత్ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన నిర్ణయం తీసుకున్నారు. జాతీయ, రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయిలలో భారత్ జాగృతికి సంబంధించిన అన్ని కమిటీలను మార్చి 10 ఆదివారం నాడు రద్దు చేస్తూ తన నిర్ణయాన్ని ప్రకటించారు.
గతేడాది ఆగస్టులో భారత జాగృతి సంస్థ కార్యకలాపాల కోసం వివిధ స్థాయిల్లో కమిటీలను ఏర్పాటు చేశారు. ఇప్పుడు భారత జాగృతి సంస్థకు చెందిన అన్ని కమిటీలను రద్దు చేస్తున్నట్టు నేడు ప్రకటించారు. విదేశీ, జాతీయ, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, మండల స్థాయి కమిటీలన్నీ రద్దు చేస్తున్నట్టు కవిత కార్యాలయం నుంచి ఓ ప్రకటన వెలువడింది. కమిటీల రద్దు తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపారు. ఈ కమిటీల రద్దుకు కారణం ఏమిటన్నది ఇంకా తెలియలేదు.
పత్రికా ప్రకటన
— Bharat Jagruthi (@BharatJagruthi) March 10, 2024
10 మార్చ్ 2024
భారత జాగృతి గౌరవ వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి ఆదేశాల మేరకు భారత జాగృతి ( విదేశీ, జాతీయ , రాష్ట్ర, జిల్లా, మండల , గ్రామ స్థాయి ) కమిటీలు రద్దు చేయడమైనది. ఈ రద్దు వెంటనే అమలులోకి వస్తుంది.
ఇట్లు
భారత్ జాగృతి అధ్యక్షురాలు కవిత…
"పత్రికా ప్రకటన
10 మార్చ్ 2024
భారత జాగృతి గౌరవ వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి ఆదేశాల మేరకు భారత జాగృతి ( విదేశీ, జాతీయ , రాష్ట్ర, జిల్లా, మండల , గ్రామ స్థాయి ) కమిటీలు రద్దు చేయడమైనది. ఈ రద్దు వెంటనే అమలులోకి వస్తుంది.
ఇట్లు
భారత్ జాగృతి అధ్యక్షురాలు కవిత గారి కార్యాలయం" అంటూ ట్వీట్ చేశారు.
గతంలో తెలంగాణ జాగృతిగా పేరున్న భారత్ జాగృతిని 2005లో తెలంగాణ రాష్ట్ర సాధన ఆందోళనల మధ్య కల్వకుంట్ల కవిత స్థాపించారు. టీఆర్‌ఎస్ బీఆర్‌ఎస్‌గా మారిన నేపథ్యంలో ఈ సంస్థ కొత్త పేరుతో జాతీయ స్థాయికి మారి తెలంగాణ వెలుపల తన కార్యకలాపాలను విస్తరించింది. భారత్ జాగృతి మహిళల హక్కుల కోసం, ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ చట్టాల అమలుకు సంబంధించి పోరాటాలను ప్రారంభించింది.