సర్పంచ్ ఎన్నికలు జరగనివ్వం : ఎమ్మెల్సీ కవిత

బంజారా హిల్స్ లోని ఎమ్మెల్సీ కవిత నివాసంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బీసీ సంఘాల సమావేశం జ‌రిగింది.

By Medi Samrat  Published on  27 Dec 2024 3:09 PM IST
సర్పంచ్ ఎన్నికలు జరగనివ్వం : ఎమ్మెల్సీ కవిత

బంజారా హిల్స్ లోని ఎమ్మెల్సీ కవిత నివాసంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బీసీ సంఘాల సమావేశం జ‌రిగింది. స‌మావేశంలో ముందుగా బీసీ సంఘం నేతలు, ఎమ్మెల్సీ కవిత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు. అనంతరం కామారెడ్డి డిక్లరేషన్, స్థానిక సంస్థలలో బీసీలకు 42% శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ సమావేశంలో చర్చించారు.

ఆపై ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. గ్రామాల్లో ఎన్నిక‌ల హ‌డావుడి మొద‌లైంద‌ని.. సర్పంచ్ ఎన్నికలు జరగనివ్వం అన్నారు. బీసీల రిజర్వేషన్లు పెంచకుంటే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనివ్వం అని ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రించారు. జనాభాలో సగానికిపైగా బీసీలు ఉన్నారు.. కానీ 42 శాతం అని కాంగ్రెస్ ఎలా చెబుతుందో అంతుపట్టడం లేదు.. ఆ 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుండానే ఎన్నికలు నిర్వహిస్తారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.. రిజర్వేషన్లు పెంచకుంటే ఎన్నికలు జరగనివ్వం.. మండల కేంద్రాల్లో, జిల్లాల్లో నిరసన ప్రదర్శన చేస్తామ‌ని హెచ్చ‌రించారు.

Next Story