తెలంగాణ తల్లి మీద ఓట్టేసి.. అలా పోటీ చేస్తామని ప్రమాణం చేసే దమ్ముందా.? కేటీఆర్‌కు జీవన్ రెడ్డి స‌వాల్‌

తెలంగాణ ఉద్య‌మం గురించి కేటీఆర్ మాట్లాడడం ఆశ్చర్యం వేస్తుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.

By Medi Samrat  Published on  13 Sept 2023 7:11 PM IST
తెలంగాణ తల్లి మీద ఓట్టేసి.. అలా పోటీ చేస్తామని ప్రమాణం చేసే దమ్ముందా.? కేటీఆర్‌కు జీవన్ రెడ్డి స‌వాల్‌

తెలంగాణ ఉద్య‌మం గురించి కేటీఆర్ మాట్లాడడం ఆశ్చర్యం వేస్తుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. 2004 సాధారణ ఎన్నికల్లో కేటీఆర్ ఎక్కడ కనిపించలేదు ఎందుకు.. అప్పుడు అమెరికా లో ఏం చేస్తున్నారని ప్ర‌శ్నించారు. యూపీఏ ప్రభుత్వంలో కేసీఆర్ మంత్రి అయిన తర్వాత.. కేటీఆర్, కవితలు తెలంగాణ కు వచ్చారని గుర్తుచేశారు. అనవసరంగా కేసీఆర్ తెలంగాణ నినాదం ఎత్తుకున్నారని కేటీఆర్ అన్న మాటలకు చాలా మంది సాక్షులు ఉన్నారని పేర్కొన్నారు. ఏపీ లో పార్టీ ఉనికి పోతుందని తెలిసి కూడా.. తెలంగాణ ఇచ్చిన చరిత్ర మాది అని అన్నారు.

ఆకాశం మీద నుంచి ఊడిపడినట్లుగా కేటీఆర్ మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. తెలంగాణ తల్లి మీద ఓట్టేసి మందు,పైసల్ పంచకుండా ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రమాణం చేసే దమ్ముందా అని స‌వాల్ విసిరారు. రెండో ప్రభుత్వంలో ఓక్క కొత్త డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా నిర్మించలేదని.. ఎన్నికల కోసమే కేటీఆర్ డ్రామాలు అంటూ మండిప‌డ్డారు.

దళితబంధుకు ఎందుకు నిధులు విడుదల చేయడం లేదని ప్ర‌శ్నించారు. ఇందిరమ్మ ఇళ్ళు లేని గ్రామం లేదని పేర్కొన్నారు. అధికార పార్టీలో చేరితేనే దళిత బంధు, బీసీ బంధు, డబుల్ బెడ్ రూమ్ అంటున్నారు. ఇదే నా కేటీఆర్ దృష్టిలో పారదర్శకత అంటే.. అని ప్ర‌శ్నించారు.

కలెక్టర్ లు బీఆర్ఎస్ తొత్తులుగా పనిచేస్తున్నారని మండిప‌డ్డారు. లబ్ధి దారుల నుంచి అప్లికేషన్స్ తీసుకోకుండా లబ్ది దారులను ఎలా ఎంపిక చేస్తారని ఫైర్ అయ్యారు. బీజేపీ, బీఆర్ఎస్ లు బోమ్మా ,బొడుసు లాంటివన్నారు. బీజేపీ సహాకారంతోనే గతంలో బీఆర్ఎస్ ముందస్తుకు వెళ్లింద‌ని.. అమిత్ షా చేతిలో కేసీఆర్ జుట్టు ఉందన్నారు. ఎన్నికల విషయంలో బీఆర్ఎస్ కన్ఫ్యూజ్ చేస్తుందని.. ఇందులో కేటీఆర్ కూడా భాగస్వామేన‌న్నారు.

Next Story