హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానం రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. మొత్తం 93 మందిలో ఇప్పటివరకు 90 మంది ఎలిమినేషన్ అయ్యారు. టి.ఆర్.ఎస్ అభ్యర్థి వాణీదేవికి 15,321 ఓట్లు రాగా.. బిజేపి అభ్యర్థి రాంచందర్‌రావుకు 14,530 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి ప్రొ.నాగేశ్వర్‌కు 13,773 ఓట్లు వచ్చాయి. బిజేపి అభ్యర్థిపై 8,812 ఓట్ల ఆధిక్యంలో వాణీదేవి ఉన్నారు.
నల్గొండ-ఖమ్మం-వరంగల్ ఎమ్మెల్సీ స్థానం ఓట్ల లెక్కింపు కొనసాగుతూనే ఉంది. రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు. ఇప్పటివరకు 67 మంది అభ్యర్థులు ఎలిమినేషన్ అయ్యారు. పల్లా రాజేశ్వర్ రెడ్డికి 11,799 ఓట్లు రాగా... తీన్మార్ మల్లన్నకు 15,817 ఓట్లు, కోదండరామ్‌కు 19,335 ఓట్లు వచ్చాయి.
పల్లా రాజేశ్వర్ రెడ్డికి సమీప ప్రత్యర్థి మల్లన్నపై 23,432 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి రాములు నాయక్ ఎలిమినేషన్ పూర్తైంది. బిజెపి అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డికి మొత్తం 44,010 ఓట్లు వచ్చాయి. భాజపా అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డి ఎలిమినేషన్ కొనసాగుతుంది