ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో కీలక పరిణామం

MLAs poaching case Telangana HC upholds lower court order. ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో బీజేపీ నేత బీఎల్ సంతోష్ సిట్ విచారణపై స్టేను కోర్టు పొడిగించింది.

By Medi Samrat
Published on : 2 Jan 2023 6:15 PM IST

ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో కీలక పరిణామం

ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో బీజేపీ నేత బీఎల్ సంతోష్ సిట్ విచారణపై స్టేను కోర్టు పొడిగించింది. ఈనెల 23వ తేదీ వరకు స్టేను హైకోర్టు పొడిగించింది. జగ్గుస్వామి, తుషార్, శ్రీనివాస్ లకు సీఆర్పీసీ 41ఏ నోటీసుల పై విచారణ చేసేందుకు స్టే ను హైకోర్టు పొడిగించింది.

నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు ఎర వేశారనే కేసులో తెలంగాణ సిట్ కు హైకోర్టులో చుక్కెదురైంది. సిట్ వేసిన రివిజన్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో ముగ్గుర్నీ నిందితులుగా చేరుస్తూ సిట్ మెమో జారీ చేసిన సంగతి తెలిసిందే. బీజేపీ కీలక నేత బీఎల్ సంతోష్, తుషార్, శ్రీనివాస్ లకు మెమో ఇచ్చింది. అయితే ఈ ముగ్గురినీ నిందితులుగా చేర్చడాన్ని ఏసీబీ కోర్టు తోసిపుచ్చుతూ, మెమోను కొట్టివేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టును సిట్ ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు మెమోను ఏసీబీ కోర్టు కొట్టివేయడాన్ని సమర్థించింది.


Next Story