నేను ఫోన్ ట్యాపింగ్ బాధితుడినే : కాంగ్రెస్ ఎమ్మెల్యే

మహబూబ్ నగర్ నియోజకవర్గంలో, రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల నుంచి ఫోన్ ట్యాఫింగ్ బాధితుడిగా ఉన్నాన‌ని మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు

By Medi Samrat  Published on  26 March 2024 4:40 PM IST
నేను ఫోన్ ట్యాపింగ్ బాధితుడినే : కాంగ్రెస్ ఎమ్మెల్యే

మహబూబ్ నగర్ నియోజకవర్గంలో, రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల నుంచి ఫోన్ ట్యాఫింగ్ బాధితుడిగా ఉన్నాన‌ని మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ట్యాఫింగ్ అంశంపై డీజీపీ కార్యాలయంలో డీజీపీ ర‌వి గుప్తాను కలిసి నిందితుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. తమకు ఇష్టం లేని వారిపై రాజకీయ ప్రత్యర్థులపై అప్ప‌టి అధికార బీఆర్ఎస్‌ ఎస్ఐబి అధికారులతో ఫోన్ టాపింగ్ పాల్పడ్డారని ఆరోపించారు. గత ప్రభుత్వం ప్రశ్నించే వారిపై ఫోన్ ట్యాపింగ్‌ బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించిందన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత సీమాంధ్ర నిర్బంధం కంటే వెయ్యి రేట్లు ఎక్కువ కేసీఆర్ నిర్బంధం చేశార‌ని అన్నారు.

హైదరాబాద్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి దర్యాప్తులో భాగంగా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో బయటపడుతుందన్నారు. ఎలక్షన్ల సమయంలో నా ఫోన్ కూడా టాపింగ్ చేశారు. నా బంధువుల, నా అనుచరుల ఫోన్లను సైతం టాపింగ్ చేశారని ఆరోపించారు. నేను కూడా బాధితుడినే కాబట్టి ఆధారాలతో సహా డీజీపీ రవి గుప్తకు ఫిర్యాదు చేశానన్నారు. రాజ్యాంగం మనకు కొన్ని హక్కులు కల్పించింది. వ్యక్తిగత విషయాలు కనుక్కొని బ్లాక్ మెయిల్ కు పాల్పడ్డారని అన్నారు. ఎవరి ఆదేశాల మేరకు గత ఐదు సంవత్సరాలు ఫోన్ టాపింగ్ కు పాల్పడ్డారో పోలీసులు వారిని బయటికి తీసుకువచ్చి తెలంగాణ ప్రజలకు తెలియజేయాలని డీజీపీని కోరిన‌ట్లు తెలిపారు. భారత ప్రభుత్వం అనుమతి లేకుండా ఇజ్రాయిల్ నుండి అత్యాధునిక టెక్నాలజీని తీసుకు వచ్చి రాజకీయ నాయకులు, వ్యాపారవేత్త‌ల ఇంటి చుట్టూ ఏర్పాటు చేసి వినడం చట్టరీత్యానేరమని శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story