నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తప్పా... డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గాని... అందాల దునియానే సూపిత్తప్పా... చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కాని... అంటూ సాగుతున్న ఈ పాట సోషల్ మీడియాలో ఏ విధంగా ట్రెడింగ్‌లో మారిందో మనందరికి తెలిసిందే. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఈ పాట వింటూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ పాటకు స్టెప్పులేసిన ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా జనగాం జిల్లా స్టేషన్‌ఘన్ పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య చిన్నారులతో బుల్లెట్ బండి సాంగ్‌కి స్టేప్పులేశారు.
పాట ట్యూన్‌కు తగ్గట్టుగా చిన్నారులతో కలిసి స్టెప్పులేస్తూ ఎమ్మెల్యే రాజయ్య అక్కడున్న వారిని ఆశ్చర్యపరిచారు. చిల్పూర్ మండలంలోని పల్లగుట్ట గ్రామంలో డా.బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం అనంతరం చిన్నారులతో కలిసి రాజయ్య డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన కొందరు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.