ములుగు ఎమ్మెల్యే సీతక్కకు తప్పిన పెను ప్రమాదం

MLA Seethakka Escape From Boat Incident. ములుగు ఎమ్మెల్యే సీతక్కకు పెను ప్రమాదం తప్పింది.

By Medi Samrat
Published on : 16 July 2022 5:01 PM IST

ములుగు ఎమ్మెల్యే సీతక్కకు తప్పిన పెను ప్రమాదం

ములుగు ఎమ్మెల్యే సీతక్కకు పెను ప్రమాదం తప్పింది. ముంపు ప్రాంతాల్లో నిత్యావసర వస్తువులు పంపిణీ చేసి తిరిగి వస్తుండగా సీతక్క ప్రయాణిస్తున్న పడవలో పెట్రోల్​ అయిపోయింది. దీంతో పడవ వాగు మధ్యలో ఓ చెట్టును ఢీకొట్టి నిలిచిపోయింది. వాగు ఉద్ధృతికి ఒడ్డుకు కొట్టుకువచ్చింది.అప్రమత్తమైన అధికారులు సీతక్కను పడవలో నుంచి క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. సీతక్కతో పాటు పడవలో ఉన్న వారంతా సురక్షితంగా బయటపడినట్లు వెల్లడించారు.

ములుగు జిల్లాలోని ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఆమె ఎలిశెట్టిపేట వద్ద నిత్యావసర సరుకులు పంపిణీ చేసి వస్తుండగా.. పడవలో పెట్రోల్ అయిపోవడంతో అదుపు తప్పి ఆ పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టింది. సీతక్క వెంటనే పడవ దిగడంతో పెను ప్రమాదం తప్పింది. ఈఘటనలో పడవలో ఉన్నవారికి ఎలాంటి ప్రమాదం కూడా జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.







Next Story