రెండో రోజు విచారణకు హాజరైన ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి

MLA Rohi Reddy Attended the ED Inquiry on the second day. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి రెండో రోజు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)

By Medi Samrat
Published on : 20 Dec 2022 6:13 PM IST

రెండో రోజు విచారణకు హాజరైన ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి రెండో రోజు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆయన ఈడీ ఎదుటకు హాజరయ్యారు. ఉదయం 10:30 గంటలకే విచారణకు హాజరుకావాలని అధికారులు చెప్పినా తాను ఆయప్ప దీక్షలో ఉన్న కారణంగా పూజలు, భిక్ష కార్యక్రమాలు పూర్తి చేసుకుని వచ్చేసరికి ఆలస్యం అయిందని రోహిత్ రెడ్డి తెలిపారు.

గత శుక్రవారం ఈడీ నోటీసులు అందుకున్న రోహిత్ రెడ్డి సోమవారం తొలిసారి ఈడీ విచారణను ఎదుర్కొన్నారు. సుమారు ఏడు గంటల పాటు సాగిన విచారణ అనంతం బయటకు వచ్చిన రోహిత్ రెడ్డి.. ఈడీ అధికారులు తనను ఎందుకు పిలిచారో తెలియదని.. విచారణకు సహకరిస్తానని అన్నారు. అసలు తనను ఏ కేసులో పిలిచారో కూడా తనకు తెలియదని చెప్పారు.


Next Story