మంత్రి హరీష్ రావు‌తో ఎమ్మెల్యే రాజాసింగ్ భేటీ

MLA Rajasingh met with Minister Harish Rao. మ‌రికొద్ది రోజుల్లో తెలంగాణలో ఎన్నికలు జ‌రుగ‌నున్నాయి.

By Medi Samrat  Published on  14 July 2023 9:57 AM GMT
మంత్రి హరీష్ రావు‌తో ఎమ్మెల్యే రాజాసింగ్ భేటీ
మ‌రికొద్ది రోజుల్లో తెలంగాణలో ఎన్నికలు జ‌రుగ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో చేరిక‌లు, భేటీల‌తో రాష్ట్ర‌ రాజకీయాలు రసవత్త‌రంగా మారాయి. కొద్దిరోజుల క్రితం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాహుల్ గాంధీ స‌మ‌క్షంలో కాంగ్రెస్‌లో చేర‌గా.. మ‌రో నేత‌, మాజీమంత్రి 20న కొల్లాపూర్ వేదిక‌గా హ‌స్తం గూటికి చేర‌నున్నారు.


ఇదిలావుంటే.. బీజేపీ నుంచి బ‌హిష్క‌ర‌ణ‌కు గురైన‌ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్.. శుక్రవారం మంత్రి హరీష్ రావుతో భేటీ అయ్యారు. బీజేపీ వేటు వేసిన త‌ర్వాత‌.. రాజాసింగ్ కొంత‌కాలం సైలెంట్‌గా ఉన్నారు. ఆ త‌ర్వాత టీడీపీలో చేర‌నున్న‌ర‌నే వార్త‌లు వ‌చ్చాయి. అయితే తాను టీడీపీలో చేర‌డం లేద‌ని ఆ వార్త‌ల‌ను రాజాసింగ్ ఖండించారు. పార్టీలో ఫైర్ బ్రాండ్‌గా పేరున్న రాజా సింగ్‌కు స‌స్పెన్ష‌న్ ఎత్తివేస్తూ.. బీజేపీ అధిష్టానం నుంచి పిలుపు వ‌స్తుంద‌ని అంద‌రూ ఆశించారు. కానీ అలా ఏమీ జ‌రుగ‌లేదు. బండి సంజ‌య్ అధ్య‌క్ష మార్పు జ‌రిగి.. ఆ స్థానంలోకి కిష‌న్ రెడ్డి వ‌చ్చారు. అయినా రాజా సింగ్‌ను ప‌ట్టించుకున్న‌వాళ్లు లేరు. ఈ నేప‌థ్యంలోనే మంత్రి హరీష్ రావుతో రాజా సింగ్‌ భేటీ ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న వేళ.. అధికార పార్టీ కీల‌క నేత‌ను రాజా సింగ్ క‌ల‌వ‌డం ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది.




Next Story