కొద్దిరోజుల కిందటే గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ భారతీయ జనతా పార్టీని వీడారు. ఆయన పార్టీ మారినా బీజేపీ నేతలపై విమర్శలను మాత్రం ఆపడం లేదు. తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రామచందర్ రావుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు రాజా సింగ్. రామచందర్ రావు రబ్బర్ స్టాంప్ అంటూ విమర్శలు గుప్పించారు. భారతీయ జనతా పార్టీకి రైటర్ కాదని, ఫైటర్ కావాలన్నారు.
బండి సంజయ్ కుమార్ కు అధ్యక్ష పదవి ఇచ్చి ఉంటే.. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉండేదని వివరించారు. రామచంద్రరావు భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ కాకూడదని చివరి వరకు అడ్డుకునే ప్రయత్నం చేశానన్నారు రాజాసింగ్. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలంటే.. సమూల మార్పులు జరగాలన్నారు.
బీజేపీ అంటే ఇప్పటికీ తనకు ప్రాణమేనన్నారు రాజాసింగ్. బీజేపీ వాళ్లు తనను పక్కన పెట్టారు కావొచ్చు కానీ తాను మాత్రం పార్టీని పక్కన పెట్టలేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.