10 ఏళ్లు తానే సీఎం అన్న రేవంత్‌.. రాజగోపాల్‌ రెడ్డి అభ్యంతరం

రాబోయే పదేళ్లు తానే సీఎం అని రేవంత్‌ రెడ్డి ప్రకటించుకోవడం కాంగ్రెస్‌ పార్టీ విధానాలకు వ్యతిరేకం అని ఆ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి అన్నారు.

By అంజి
Published on : 19 July 2025 9:24 AM IST

MLA Rajagopal Reddy, CM Revanth, Telangana, Congress

10 ఏళ్లు తానే సీఎం అన్న రేవంత్‌.. రాజగోపాల్‌ రెడ్డి అభ్యంతరం

రాబోయే పదేళ్లు తానే సీఎం అని రేవంత్‌ రెడ్డి ప్రకటించుకోవడం కాంగ్రెస్‌ పార్టీ విధానాలకు వ్యతిరేకం అని ఆ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి అన్నారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌లో అధిష్ఠానం ఆదేశాల మేరకు, ప్రజాస్వామ్యబద్ధంగా సీఎం ఎన్నిక ఉంటుందన్నారు. తెలంగాణ కాంగ్రెస్‌ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నిఖార్సైన పార్టీ నాయకులు, కార్యకర్తలు సహించరు అని రాజగోపాల్‌ రెడ్డి ట్వీట్‌ చేశారు.

అటు నిన్న నాగర్‌ కర్నూలు సభలో మాజీ సీఎం కేసీఆర్‌పై సీఎం రేవంత్‌ రెడ్డి ధ్వజమెత్తుతూ.. 'కేసీఆర్‌.. నీ డైరీలో కాదు నీ కొడుకు గుండెపై రాసుకో.. 2034 వరకు నేనే సీఎం. ఇదే నా మాట. నీకు దుఃఖం వస్తుందో, బావిలో దూకుతావో నీ ఇష్టం. నా కోరిక ఒక్కటే. నువ్వు అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్ష నేత కుర్చీలో కుర్చోవాలి. మేం చేసే మంచి పనులు చెప్తుంటే కుమిలి కుమిలి ఏడవాలి' అని ఎద్దేవా చేశారు.

Next Story