ప్రముఖ దర్శకుడు రాజమౌళి ప్రతీ సినిమాను హిందూ సమాజం బహిష్కరించాలని పిలుపునిచ్చారు గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్. దేవుళ్లపై సినిమాలు తీసి కోట్లు సంపాదించారని, దేవుళ్లు అంటే నమ్మకం లేనప్పుడు ఆ సినిమాలు తీయడం ఎందుకుని రాజాసింగ్ ప్రశ్నించారు. ఆయన వారణాసి సినిమా ప్రమోషన్స్ కోసమే అలా మాట్లాడారా అనే దానిపై క్లారిటీ ఇచ్చి, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ ఎత్తున గ్లొబ్ ట్రోటర్ ఈవెంట్ ను నిర్వహించారు. వారణాసి గ్లింప్స్ విడియో రిలీజ్‌కు పదే పదే సాంకేతిక ఆటంకాలు ఎదుదు కావడంతో రాజమౌళి నిరాశ వ్యక్తం చేశారు. దేవుడి మీద తనకు నమ్మకం లేదంటూ రాజమౌళి చేసిన వ్యాఖ్యలు హనుమంతుడి భక్తులతో పాటు హిందూ మనోభావాలను దెబ్బతినేలా ఉన్నాయని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.