ఇటీవల తీవ్ర ఉత్కంఠ రేపిన దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించిన సంగతి తెలిసిందే. మొత్తం 23 రౌండ్లలో సాగిన లెక్కింపులో రఘునందన్‌రావుకు 62,772 ఓట్లు రాగా.. సోలిపేట సుజాతకి 61,302 ఓట్లు వచ్చాయి. ఇక కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డికి 21,819 ఓట్లు వచ్చాయి. ఓట్ల శాతం చూసుకుంటే.. బీజేపీకి 39 శాతం, టీఆర్ఎస్‌కి 37శాతం ఓట్లు వచ్చాయి.
దుబ్బాక ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 18న స్పీకర్ ఛాంబర్‌లో మధ్యాహ్నం ఒంటి గంటకు రఘునందన్‌రావు దుబ్బాక ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక ఈ విజయం బీజేపీలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. రానున్న జీహెచ్‌ఎంసీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇదే జోరును కొనసాగించాలని కమలం నేతలు బావిస్తున్నారు.