'లిక్కర్ స్కాం నిందితులతో ఎమ్మెల్సీ కవితకు సంబంధాలు'

MLA Raghunandan Rao accused MLC Kavitha of having links with liquor scam accused.ఢిల్లీ మద్యం కుంభకోణం నిందితులతో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సంబంధాలు ఉన్నాయని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్

By అంజి  Published on  7 Sept 2022 4:39 PM IST
లిక్కర్ స్కాం నిందితులతో ఎమ్మెల్సీ కవితకు సంబంధాలు

ఓ ఆంగ్ల దినపత్రిక ప్రచురించిన ఫోటోతో కూడిన వార్తాకథనాన్ని చూపుతూ.. ఢిల్లీ మద్యం కుంభకోణం నిందితులతో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సంబంధాలు ఉన్నాయని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. తాజాగా లిక్కర్‌ స్కాం ఆరోపణల నిందితుడితో ఎమ్మెల్సీ కవిత దిగిన ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. లిక్కర్‌ స్కాం కేసులో ఏ-14గా ఉన్న రామచంద్ర పిళ్లై ఫ్యామిలీతో తిరుమలలో కవిత కనిపించారు. బోయినపల్లి అభిషేక్‌రావుతో సహా ఆమె తిరుమలకు వెళ్లారు.

లిక్కర్‌ స్కాం నిందితుడితో ఎమ్మెల్సీ కవిత తిరుమలకు వెళ్సాల్సిన అవసరం ఏముందని రఘునందన్‌ రావు ప్రశ్నించారు. రామచంద్ర పిళ్లైని కలవలేదని గతంలో కవిత చెప్పారని గుర్తు చేశారు. లిక్కర్‌ స్కామ్‌తో సంబంధం లేదన్న కవిత.. రామచంద్ర పిళ్లైతో కలిసి తిరుమలకు ఎందుకెళ్లారని నిలదీశారు. ఫిబ్రవరి 2022లో చిత్రీకరించబడిన ఫోటోలో అరుణ్ రామచంద్ర పిళ్లై, బోయినపల్లి అభిషేక్ రావు కుటుంబాలతో కవిత కనిపించింది. ఈ స్కామ్‌లో అరుణ్‌ను ఏ-14గా ఈడీ పేర్కొంది.

లిక్కర్‌ స్కాం నిందితుల్లో ఒకరైన సుదిని సృజన్ రెడ్డి, కవిత అడికోర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో బిజినెస్‌ నిర్వహిస్తున్నారని వార్తాపత్రిక కథనాన్ని చదివారు. ఈ ఫోటోపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కుమార్తె స్పందించాలని రఘునందన్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మరమనిషి అనేది నిషేధిత పదమా? అని ఎమ్మెల్యే రఘునందన్‌ రావు ప్రశ్నించారు. మరోవైపు ఢిల్లీ లిక్కర్‌స్కాంలో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. సీబీఐ సమాచారంతో ముడుపులపై ఈడీ డొంక లాగుతోంది.

ఢిల్లీ మద్యం టెండర్స్‌లో కంపెనీల సిండికేట్‌కు హైదరాబాద్‌లో రూపకల్పన జరిగినట్లు సీబీఐ అనుమానం వ్యక్తం చేస్తోంది. దీంతో హైదరాబాద్‌లో ఐదు చోట్ల ఢిల్లీ ఈడీ బృందం దాడులు చేసింది. రాబిన్‌ డిస్టలరీస్‌, డైరెక్టర్‌ కార్యాలయాల్లో సోదాలు జరుపుతోంది. సికింద్రాబాద్‌, కోకాపేట్‌, నార్సింగ్‌లో సీబీఐ సోదాలు జరిపింది. కీలక డాక్యుమెంట్లు, బ్యాంక్‌ లావాదేవీలు స్వాధీనం చేసుకుంది. అనుమానాస్పద బ్యాంక్‌ లావాదేవీలపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి వ్యాపారాలపై దృష్టి సారిస్తున్నారు.

Next Story