లబ్ధిదారులు చెక్కుల కోసం నా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు.. ఎమ్మెల్యే అస‌హ‌నం

కూకట్ పల్లి నియోజక వర్గంలో నెల రోజులుగా 550 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు నిలిపివేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు.

By Kalasani Durgapraveen  Published on  25 Nov 2024 2:20 PM IST
లబ్ధిదారులు చెక్కుల కోసం నా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు.. ఎమ్మెల్యే అస‌హ‌నం

కూకట్ పల్లి నియోజక వర్గంలో నెల రోజులుగా 550 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు నిలిపివేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. మంత్రి చేతుల మీదగా లబ్ధిదారులకు అందజేస్తామని అధికారులు చెప్తున్నారు. లబ్ధిదారులు చెక్కుల కోసం కోసం నా ఇంటి చుట్టూ తిరుగుతున్నారన్నారు. కళ్యాణ లక్ష్మి, షాది ముభారక్ చెక్కులు ఎమ్మెల్యే పంపిణీ చేసే ఆనవాయితీ గతంలో ఉండేది.. ఈ ప్రభుత్వ అధికారులు.. మంత్రి వస్తేనే లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని అంటున్నారని అస‌హ‌నం వ్య‌క్తం చేశారు.

నెల రోజులుగా కలెక్టర్, ఆర్డీఓ, ఏంఆర్ఓలు, పలుమార్లు ఫోన్ చేసిన మంత్రి వస్తినే పంపిణీ చేస్తాం అని సమాధానం చెప్పడం సరైన పద్ధతి కాదన్నారు. ఎమ్మెల్యే రావడం అధికారులకు ఇబ్బంది అయితే అధికారులే పంపిణీ చేయండి అని సూచించారు. కానీ కళ్యాణ లక్ష్మి లబ్దిదారులకు ఇబ్బంది పెట్టితే ఊరుకోం అన్నారు. రేపు ఉదయం 11 గంటల వరకు లబ్దిదారులకు పంపిణీ చేయకపోతే ఏంఆర్ఓ ఆఫీసు దగ్గర ధర్నా చేస్తామ‌న్నారు.

Next Story