లాస్య పోస్టుమార్టం రిపోర్టు.. ఆ ఒక్కటీ చేసి ఉంటే ప్రాణాలు దక్కి ఉండేవి..!

లాస్య నందిత మృతదేహానికి గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తయింది. లాస్య మృత దేహానికి పోస్టు మార్టం చేసిన వైద్యులు కీలక విషయాలు బయటపెట్టారు

By Medi Samrat  Published on  23 Feb 2024 2:26 PM IST
లాస్య పోస్టుమార్టం రిపోర్టు.. ఆ ఒక్కటీ చేసి ఉంటే ప్రాణాలు దక్కి ఉండేవి..!

లాస్య నందిత మృతదేహానికి గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తయింది. లాస్య మృత దేహానికి పోస్టు మార్టం చేసిన వైద్యులు కీలక విషయాలు బయటపెట్టారు. చనిపోవడానికి మూడు ప్రధాన కారణాలు ఉన్నాయని నివేదిక విడుదల చేశారు. లాస్య నందిత తలకు కుడి వైపు బలమైన గాయం అయ్యిందని చెప్పారు. యాక్సిడెంట్ లో ఎడమ కాలు విరిగిపోయిందని తెలిపారు. ముందు భాగం కిందపడటంతో 6 దంతాలు విరిగిపోయాయని.. తలకు బలమైన గాయంతోనే చనిపోయిందని HOD కృపాల్ సింగ్ తెలిపారు.

బలమైన గాయాలై స్పాట్‌లోనే కన్నుమూసినట్లు పోస్టుమార్టం ప్రైమరీ రిపోర్టులో తెలిపారు. తై బోన్, రిబ్స్ ఫ్యాక్చర్ అయ్యాయని.. ఒక కాలు పూర్తిగా విరిగిపోయినట్లు రిపోర్టులో పేర్కొన్నారు. శరీరంలో ఎముకలు పూర్తిగా దెబ్బతిన్నాయని.. సీటు బెల్టు పెట్టుకోకపోవటంతోనే తీవ్ర గాయాలపాలై ఆమె మృతి చెందినట్లు చెప్పారు. సీటు బెల్టు ధరించి ఉంటే గాయాలు అయ్యేవని.. ప్రాణాలు దక్కి ఉండే అవకాశాలు ఉండేవని డాక్టర్లు చెబుతున్నారు. కారు ప్రమాద సమయంలో లాస్య నందిత వెనుక సీట్లో కూర్చొని ఉంది. అయితే ఆమె ప్రయాణిస్తున్న సమయంలో సీటు బెల్టు ధరంచలేదు. ఫిబ్రవరి 23 తెల్లవారుజామున రోడ్డు పక్కన డివైడర్‌ను ఢీ కొట్టడంతో స్పాట్‌లోనే కన్నుమూసింది. డ్రైవింగ్ చేస్తున్న పీఏ ఆకాశ్ తీవ్రంగా గాయపడగా.. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Next Story