నిరుద్యోగుల నిరసనలకు నా మద్దతు ఉంటుంది, మరోసారి కాంగ్రెస్ ఎమ్మెల్యే హాట్ కామెంట్స్

ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేయాలి..అని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.

By -  Knakam Karthik
Published on : 17 Sept 2025 4:35 PM IST

Hyderabad, MLA Komatireddy Rajagopal, Congress, Cm Revanth

హైదరాబాద్: ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేయాలి..అని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. గన్ పార్క్ చేరుకుని అమరుల స్తూపం వద్ద నివాళులర్పించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ మీడియాతో మాట్లాడుతూ హాట్ కామెంట్స్ చేశారు. నిరుద్యోగ యువత ఖాళీలు భర్తీ చేయాలని డిమాండ్ మంచిదే. నిరుద్యోగ పిల్లలకు దారి చూపించే బాధ్యత మన ప్రభుత్వం పై ఉంది. నిరుద్యోగులను కాపాడుకునే బాధ్యత ప్రభుత్వంపై ఉంది...అని రాజగోపాల్ అన్నారు.

గ్రూప్ 1 అవకతవకలపై ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తా. నిరుద్యోగ యువత కష్టాల్లో ఉన్నారు. కేసీఆర్‌ను గద్దె దించడంలో యువత పాత్ర కీలకం. నిరుద్యోగులకు అండగా ఉంటా అమరవీరుల సాక్షిగా చెప్తున్నా. మీ సమస్యలు వినేందుకు నేనే వస్తా. సిటీ సెంట్రల్ లైబ్రరీ , అశోక్ నగర్‌కు వస్తా మీ నిరసనలకు నా మద్దతు ఉంటుంది. నిరుద్యోగుల పట్ల ఏ సమస్య అయినా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్తా. తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరగవద్దని సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చింది..అని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Next Story