ఎంపీ అరవింద్‌ను అడ్డుకున్నది టీఆర్ఎస్ శ్రేణులు కాదు
MLA Jeevan Reddy Fires On MP Aravind. ఎంపీ అరవింద్ ను అడ్డుకున్నది టీఆర్ఎస్ శ్రేణులు కాదు.. పసుపు రైతులని
By Medi Samrat Published on 25 Jan 2022 12:05 PM GMT
ఎంపీ అరవింద్ ను అడ్డుకున్నది టీఆర్ఎస్ శ్రేణులు కాదు.. పసుపు రైతులని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. రైతులకు సమాధానం చెప్పలేకనే మామిడిపల్లి నడిరోడ్డుపై నాటకాలని.. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు రైతుల ముందుకెళ్లే ధైర్యం లేక టీఆర్ఎస్ పై అక్కసు వెళ్లగక్కుతున్నారని ఫైర్ అయ్యారు. టీఆర్ఎస్ ను విమర్శించేముందు ఎంపీ అరవింద్ రైతులకు సమాధానం చెప్పాలని అన్నారు. ఎంపీగా గెలిపిస్తే పసుపు బోర్డు తెస్తానని చెప్పావా? లేదా?.. పసుపుబోర్డు తేలేకపోతే రాజీనామా చేసి రైతుల ఉద్యమంలో పాల్గొంటానని బాండ్ పేపర్ రాసిచ్చావా? లేదా? మూడేళ్లు కావస్తున్నా పసుపుబోర్డు తేలేని నువ్వు దద్దమ్మవి. .చవటవి అవునా? కాదా? అని ప్రశ్నల వర్షం కురిపించారు.
రైతులను నట్టేట ముంచిన అరవింద్ ఒక నయవంచకుడని.. కపట మాటల పగటి వేషగాడని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రైతు ద్రోహి.. నిజామాబాద్ జిల్లాకు పట్టిన అష్ట దరిద్రం.. ఐదేళ్ల శని అని మండిపడ్డారు. పసుపుబోర్డు తీసుకురాకుండా అరవింద్ ఏ గ్రామంలో అడుగుపెట్టలేడని జీవన్ రెడ్డి అన్నారు. రైతుల దృష్టి మళ్లించడానికే కేసీఆర్ పై అరవింద్ అక్కసు వెళ్లగక్కుతున్నారని అన్నారు. కేసీఆర్ జోలికొస్తే బోడిగుండు అరవింద్ ను బొందపెడతమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి.