ప్రభుత్వం నిద్రపోతుంది.. వారిని ఎందుకు పాస్ చేయరు.? : జగ్గారెడ్డి

MLA Jaggareddy Fires On Telangana Govt. తెలంగాణలో విద్యా వ్యవస్థ విషయంలో ప్రభుత్వం నిద్ర పోతుందని టీపీసీసీ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్

By Medi Samrat  Published on  23 Dec 2021 12:23 PM IST
ప్రభుత్వం నిద్రపోతుంది.. వారిని ఎందుకు పాస్ చేయరు.? : జగ్గారెడ్డి

తెలంగాణలో విద్యా వ్యవస్థ విషయంలో ప్రభుత్వం నిద్ర పోతుందని టీపీసీసీ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ జగ్గారెడ్డి విమ‌ర్శించారు. ఫెయిల్ అయిన ఇంటర్ విద్యార్థులకు మద్దతుగా జగ్గారెడ్డి నాంపల్లి ఇంటర్ బోర్డు కార్యాలయం ముందు దీక్షకు దిగారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. గత రెండేళ్లుగా విద్యార్థులు బోర్డు తీరు వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఫైర్ అయ్యారు. 4.50 లక్షల మంది పరీక్ష రాస్తే 2.35 లక్షల మంది ఫెయిల్ అయ్యారని అన్నారు. చాలా రాష్ట్రాలలో కోవిడ్ కారణంగా పాస్ చేశారని.. తెలంగాణలో విద్యార్థులు చనిపోతున్నా.. ఎందుకు పాస్ చేయడం లేదని ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించారు. ఫెయిల్ అయిన విద్యార్థులంతా ప్రభుత్వ కాలేజ్ విద్యార్థులేన‌ని.. కోవిడ్ కారణంగా ఆన్‌లైన్ క్లాస్ లు లేవని తెలిపారు.

ప్రభుత్వ కాలేజ్ విద్యార్థులకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించలేదని అన్నారు. ప్రైవేట్ కాలేజ్ లలో ఆన్‌లైన్ క్లాస్ లు జ‌రిగాయి.. పాస్ అయ్యారని అన్నారు. ఎలాంటి సదుపాయాలు ఇవ్వకుండా.. ఫెయిల్ అయిన విద్యార్థులను పట్టించుకకపోతే ఎట్లా.. అని ప్ర‌శ్నించారు. విద్యార్థుల విషయంలో ప్రభుత్వం ఎందుకు ఆలస్యం చేస్తోంది.. దీని వల్ల ప్రతీ రోజు పిల్లలు చనిపోతున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకుంటే వారికే మంచిదని.. ఆలస్యం అయితే ఉపయోగం ఉండదని జగ్గారెడ్డి అన్నారు.

ఇంటర్ విషయంలో మేము సెప్టెంబర్ లోనే పరీక్షలు వద్దని స్పష్టంగా చెప్పామ‌ని ఎన్ఎస్‌యూఐ అధ్యక్షుడు వెంకట్ అన్నారు. ఈ రోజు ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని.. ఫెయిల్ అయిన వారిని పాస్ చేస్తూ.. ఇంప్రూమెంట్ కు అవకాశం ఇవ్వాలని అన్నారు. తప్పుడు నిర్ణయాలు తీసుకున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.





Next Story