డైలాగ్స్, డ్యాన్స్, సిక్స్ ఇవ‌న్నీ ఈజీగా చేయోచ్చు.. రైతులా పంట పండించ‌డం అంత సులువు కాదు

MLA Jaggareddy Fires On Celebrities. కేంద్ర ప్రభుత్వం రైతు పండించిన పంటను కార్పొరేట్ వ్యవస్థ ద్వారా నిర్బంధించి

By Medi Samrat  Published on  6 Feb 2021 3:34 AM GMT
డైలాగ్స్, డ్యాన్స్, సిక్స్ ఇవ‌న్నీ ఈజీగా చేయోచ్చు.. రైతులా పంట పండించ‌డం అంత సులువు కాదు
కేంద్ర ప్రభుత్వం రైతు పండించిన పంటను కార్పొరేట్ వ్యవస్థ ద్వారా నిర్బంధించి, భారత దేశంలో ఉన్న రైతును ఆర్ధికంగా నడ్డి విరిగేలా చట్టాలు తీసుకొచ్చిందని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత, ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి అన్నారు. గత రెండు నెలలుగా చల్లని చలిలో, దుమ్ముధూళి, రాత్రి, పగలు, వయసుకు తేడా లేకుండా 10 ఏళ్ల నుండి వందేళ్ల వయసు కలవారు పిల్లలు, యువతి యువకులు, తల్లితండ్రులు మొత్తం ఢిల్లీలో దీక్షలు చేస్తున్నారు. అయినా బీజేపీ ప్రభుత్వం ప‌ట్టించుకోవ‌డం లేద‌న్నారు.


రైతులు పండించిన పంటను తింటూ ఆ రైతుల పోరాటాన్ని వ్యతిరేకిస్తున్న కొంతమంది ఫిల్మ్, క్రికెట్ సెలబ్రిటీలు రైతుల‌కు వ్య‌తిరేకంగా మూర్ఖంగా మాట్లాడడం బాధాకరమ‌ని ఆయ‌న అన్నారు. మొఖానికి రంగులు వేసుకొని సినిమాలో పనిచేయడం, ఒక క్రికెటర్ బ్యాట్ పట్టుకొని అడటం.. రైతు భూమి మీద నాగలు పెట్టి దున్నినంత సులువు కాదని అన్నారు.

మీ సినీ పరిశ్రమల్లో కానీ, క్రికెట్ లో కానీ మీకు బ్రేక్ లు, కూల్ డ్రింక్స్, టీ లు, స్నాక్స్ ఇంటర్వెల్ లు ఉంటాయి. మీరు ఆడుతుంటే, పడుతుంటే చప్పట్లు తో ప్రోత్సాహం ఉంటుంది. కానీ భూమి మీద నాగలి పట్టి దున్ని పంటలు పండించే రైతుకు ఇలాంటి సదుపాయాలు ఉండవు. అలాంటి రైతులని మీ లాంటి కొందరు సెలెబ్రెటీ లు విమర్శించడమా..! అని ఫైర్ అయ్యారు.

పరాయి దేశస్థులు రైతులకు మద్దతు ఇస్తుంటే.. మీరు మద్దతు ఇవ్వకపోగా, విమర్శలు చేస్తారా..? అని ప్ర‌శ్నించారు. సచిన్ టెండూల్కర్, రవిశాస్త్రి, కంగనా, అజయ్ దేవగన్ మీరందరూ.. ఒక్కసారి నాగలి పట్టి భూమి దున్ని విత్తులేసి, నీరు పోసి పంట పండించగలరా ? అని తీవ్రస్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. పంట పండించడం అంటే క్రికెట్ ఆడినంత ఈసీ కాదు.. సినీ పరిశ్రమలో డైలాగ్స్‌, డాన్స్ చేసినంత సులువు కాదని అన్నారు. వృత్తిలో ఎన్ని కోట్లు సంపాదించిన చివరకు ఆ రైతు పండించిన పంటను తినే మ‌నం బ్ర‌త‌కాలి. రైతుల పట్ల పిచ్చి కామెంట్లు చేస్తే చరిత్రలో మూర్ఖులుగా నిలిచిపోతారని ఫైర్ అయ్యారు.




Next Story