అమ్మవార్ల‌ను మూడు కోరికలు కోరుకున్నా.. లోక కల్యాణం కోసమే..

MLA Jagga Reddy Visits Medaram Temple. మేడారం సమ్మక-సారక్క అమ్మవారిని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్

By Medi Samrat  Published on  30 Jun 2021 10:21 AM GMT
అమ్మవార్ల‌ను మూడు కోరికలు కోరుకున్నా.. లోక కల్యాణం కోసమే..

మేడారం సమ్మక-సారక్క అమ్మవారిని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి బుధ‌వారం దర్శించుకున్నారు. ఇటీవ‌ల కాంగ్రెస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి పొందిన‌ జగ్గారెడ్డి, త‌న‌ కుమారుడు భరత్ సాయిరెడ్డితో క‌లిసి సమ్మక్క‌-సారక్క ఆలయానికి వచ్చారు. ఈ సంద‌ర్భంగా వ‌న దేవ‌త‌ల‌ను ద‌ర్శించుకుని ప్ర‌త్యేక పూజ‌లు చేశారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ.. 10 ఏళ్లుగా మేడారం సమ్మక-సారక్క అమ్మవారి దగ్గరికి రావాలని అనుకుంటేన్నా.. ఇప్పుడు ఆ కోరిక తీరిందని అన్నారు. ప్రశాంతంగా ఉన్న సమయంలో వచ్చి దర్శించుకోవాలని అనుకున్నా.. అందుకే ఇంత సమయం పట్టిందని అన్నారు. సమ్మక-సారక్క అమ్మవార్ల‌ను మూడు కోరికలు కోరుకోవడం జరిగిందని.. నేను కోరుకున్న కోరికలన్నీ లోక కల్యాణం కోసమేన‌ని.. ఇవి ఇప్పుడే చెప్పలేనని అన్నారు. అమ్మవార్ల‌ అనుగ్రహంతో అందరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటునాన‌ని జగ్గారెడ్డి అన్నారు.


Next Story
Share it