ప్రజాస్వామ్యం మోదీ చేతిలో హత్యకు గురైంది : జగ్గారెడ్డి

MLA Jagga Reddy Fire On Modi. కాంగ్రెస్ ఎప్పుడూ రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చే ప్రయత్నం చేయలేదని

By Medi Samrat  Published on  24 Jun 2022 3:45 PM GMT
ప్రజాస్వామ్యం మోదీ చేతిలో హత్యకు గురైంది : జగ్గారెడ్డి

కాంగ్రెస్ ఎప్పుడూ రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చే ప్రయత్నం చేయలేదని టీపీసీసీ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. బీజేపీ ప్రభుత్వం ఎలక్షన్ కమీషన్ ను డమ్మీ చేసిందని విమ‌ర్శించారు. దేశంలో ఇప్పుడు 14 రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో ఉందన్న ఆయ‌న‌.. సామంత రాజుల రాజ్యలను ఆధీనం చేసుకున్నట్లుగా.. బీజేపీ దొడ్డి దారిలో రాష్ట్రాల‌లో అధికారం చెలాయిస్తుందని అన్నారు. బీజేపీకి పద్దతి లేదు.. ప్రజాస్వామ్యం లేదన్న ఆయ‌న‌.. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాలలో ప్రభుత్వాలను పడగొడుతున్నారని ఆరోపించారు.

స్టాలిన్, మమతా బెనర్జీ లాంటి బీజేపీయేత‌ర‌ నేతలను ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. ఇన్ కం టాక్స్ డిపార్ట్మెంట్ రోడ్డుపై ఉండే పాన్ షాప్ లా తయారయిందని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ పాదయాత్ర చేయకుండా, సోనియా, ప్రియాంక గాంధీలు ప్రజల వద్దకు వెళ్ళకుండా బీజేపీ కుట్రలు చేస్తుందని ఫైర్ అయ్యారు.

గోవా, మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ లలో బీజేపీ దొడ్డి దారిలో అధికారం చెలాయిస్తుందని.. ఇప్పుడు మహారాష్ట్రలో అదే పరిస్థితని అన్నారు. గతంలో కాంగ్రెస్ ఓకటి, రెండు రాష్ట్రాలలో చిన్న చిన్న తప్పులు చేసినా.. తర్వాత సరిదిద్దుకుందని అన్నారు. ప్ర‌స్తుతం ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని.. బీజేపీ తమ సిద్దాంతాలకు వ్యతిరేకంగా పనిచేస్తుందని ఎండ‌గ‌ట్టారు.

మోదీ ప్రవర్తన.. అలెగ్జాండర్ కు తీసిపోదని వ్యాఖ్యానించారు. అలెగ్జాండర్ పతనైమట్లే.. బీజేపీ పతనం అవుతుందని జోస్యం చెప్పారు. ఎనిమిదేళ్లలో ప్రజలు గోవా, మధ్యప్రదేశ్ ల‌లో కాంగ్రెస్ నీ ఎన్నుకుంటే.. అక్క‌డ ప్రభుత్వాల‌ను కూల్చి బీజేపీ ప్రభుత్వాల‌ను ఏర్పాటు చేసుకుందని అన్నారు. అరుణాచల్ ప్రదేశ్, కర్ణాటక ల‌లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాల‌ను బీజేపీ కూల్చిందని.. ప్ర‌స్తుతం మహారాష్ట్రలో శివసేన ప్రభుత్వాన్ని కుల్చుతున్నద‌ని అన్నారు.

బీజేపీ దుర్మార్గ ఆలోచన లో ఉందని.. ప్రజా స్వామ్యంను ఖూనీ చేసిందని అన్నారు. ప్రజాస్వామ్యం మోదీ చేతిలో హత్యకు గురైందని అన్నారు. జగన్ బీజేపీ ఎట్లా చెప్తే అట్లా వింటున్నాడని.. కేసీఆర్ సగం అటు..సగం ఇటు ఉన్నాడని వాఖ్యానించారు. బీజేపీ.. కాంగ్రెస్ నాయకత్వాన్ని తొక్కేసి ప్రాంతీయ పార్టీలను బ్లాక్ మెయిల్ చేస్తుందని.. ఇది మంచిది కాదని అన్నారు. బీజేపీ అడ్డదారిలో కాంగ్రెస్ నీ అణగదొక్కాలని చూస్తుందని అన్నారు.




















Next Story