నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా ఇంట విషాదం
Mla Ganesh Gupta Father Passed Away. టీఆర్ఎస్ నేత, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బీగాల గణేశ్ గుప్తా ఇంట విషాదం
By Medi Samrat Published on
21 Nov 2020 3:57 AM GMT

టీఆర్ఎస్ నేత, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బీగాల గణేశ్ గుప్తా ఇంట విషాదం చోటుచేసుకుంది. గణేశ్ గుప్తా తండ్రి కృష్ణమూర్తి అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో నాలుగు రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన శనివారం ఉదయం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
బీగాల కృష్ణమూర్తి ఆర్య వైశ్య సంఘంలో క్రియాశీలక పాత్ర వహించారు. నిజామాబాద్ జిల్లా శాఖ అధ్యక్షుడిగానూ సేవలందించారు. ఈ రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు ఎమ్మెల్యే గణేష్ గుప్తా స్వస్థలమైన మాక్లూర్‌లో కృష్ణమూర్తి అంత్యక్రియలు జరుగనున్నాయి. కృష్ణమూర్తి మృతి పట్ల పలువురు టీఆర్‌ఎస్ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.
Next Story