10 శాతం మాత్రమే మహిళలు.. కేటీఆర్ మాటే ఇది..!
Ministers KTR About Women Entrepreneurs. కేవలం 10 శాతం మాత్రమే మహిళలు పారిశ్రామిక రంగంలో ఉంటున్నారని....కేటీఆర్
By Medi Samrat Published on 10 March 2021 2:29 PM ISTఈ సందర్భంగ ఆయన మాట్లాడుతూ.. కేవలం 10 శాతం మాత్రమే మహిళలు పారిశ్రామిక రంగంలో ఉంటున్నారని.. ప్రతిభ ఉన్న మహిళా పారిశ్రామికవేత్తలకు రాష్ర్ట ప్రభుత్వం చేయూతనిస్తుందని స్పష్టం చేశారు. ఇక చాలా తక్కువ కంపెనీలు పెట్టుబడులు పొందుతున్నాయని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. పెట్టుబడుల విషయంలో ప్రభుత్వాల కృషి పెరగాల్సి ఉందని... ప్రైవేటు పెట్టుబడులు రానట్లయితే ప్రభుత్వాలు పెట్టుబడులు పెట్టాల్సి ఉందని పేర్కొన్నారు. వీ-హబ్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని.. ప్రస్తుతం నాయకత్వ స్థాయిలో ఉందని అన్నారు.
ఇతర రాష్ట్రాల్లో మహిళా ఔత్సాహికులను ప్రోత్సహించేందుకు అక్కడి ప్రభుత్వాలతో కలిసి పనిచేసిందన్నారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం వీ-హబ్ కు మంచి సపోర్ట్ ఇచ్చిందని.. దీని వల్ల రెండు దేశాల మార్కెట్లకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. గతంలో వీ-హబ్ ద్వారా గుజరాత్, కశ్మీర్‌తో భాగస్వామ్యం ఏర్పరుచుకున్నామని గుర్తు చేశారు. వీ-హబ్ ద్వారా ఆస్ట్రేలియాకు చెందిన కంపెనీలు ఇండియాకు వచ్చేందుకు సహాయం చేస్తామని హామీ ఇచ్చారు.