తెలంగాణలో రైతు భరోసా నిధుల కోసం వేచి చూస్తున్న రాష్ట్ర రైతులకు మంత్రి వివేక్ తీపి కబురు అందించారు. చెన్నూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్న ఆయన, ఈ నెల నుంచే రైతు భరోసా పంపిణీ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.
ఈ పథకం కింద మొత్తం రూ. 9,000 కోట్లను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన వెల్లడించారు. ఈ నిధులను రెండు విడతలుగా విడుదల చేయనున్నట్లు వివరించారు. ఇందులో భాగంగా తొలి విడతగా ఈ మార్చి నెలలో రూ. 4,500 కోట్లను, మిగిలిన సగం నిధులను వచ్చే నెలలో రైతుల ఖాతాలకు బదిలీ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.