వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు.. బీసీ బిడ్డలు అధైర్యపడొద్దు : మంత్రి వాకిటి శ్రీహరి

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ పడింది.

By -  Medi Samrat
Published on : 9 Oct 2025 6:10 PM IST

వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు.. బీసీ బిడ్డలు అధైర్యపడొద్దు : మంత్రి వాకిటి శ్రీహరి

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ పడింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.9 అమలును నిలిపివేస్తూ.. హైకోర్టు గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విష‌య‌మై మంత్రి వాకిటి శ్రీహరి స్పందిస్తూ.. బీసీలకు రిజర్వేషన్లు అమలు కాకుండా నోటికాడ ముద్ద లాక్కునే ప్రయత్నం చేశార‌ని మండిప‌డ్డారు. బీసీ రిజర్వేషన్లకు ఎవరు అడ్డుపడుతున్నారో.. యావత్తూ తెలంగాణ ప్ర‌జ‌లు ఆలోచన చేయాలన్నారు. ప్రభుత్వం బీసీలపై చిత్తశుద్ధితో రాష్ట్రంలో ఎంపారికల్ డేటా చేపట్టడం జరిగింది.. ఎంపారికల్ డేటా ఉన్నా స్టే విధించి బీసీల నోటికాడ ముద్ద లాగే ప్రయత్నం చేయడం శోచ‌నీయమ‌న్నారు.

42% రిజర్వేషన్లు బీసీలకు ఇస్తాం.. ఆ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన మాటపై కట్టుబడి ఉన్నాం.. కట్టుబడి ఉంటామ‌ని స్ప‌ష్టం చేశారు. రాబోయే రోజుల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలో ఆలోచన చేస్తామ‌ని.. బీసీ బిడ్డలు ఎవరూ అధైర్యపడొద్దన్నారు. బీసీలకు రిజర్వేషన్లు అమలు చేసేవిధంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్నారు. బిజెపి, బిఆర్ఎస్ బీసీ రిజర్వేషన్లకు అనుకూలంగా కేసులో ఇంప్లీడ్ అవ్వాలి.. లేకపోతే చరిత్రలో బీసీ ద్రోహులుగా మిగిలిపోతారన్నారు.

Next Story