కాళేశ్వరం ప్రాజెక్ట్ పై విచారణకు ఆదేశిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని సాగు నీటి ప్రాజెక్టుల పురోగతిపై జల సౌదాలో ఉన్నతాధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నీటి వాటా విషయమై కేంద్రంతో చర్చిస్తామన్నారు. పెండింగ్ ఉన్న ప్రాజెక్టు లను పూర్తి చేస్తామని తెలిపారు. 40 వేల చెరువుల నిర్వహణ గురించి మా ప్రభుత్వం శ్రద్ద వహిస్తుందన్నారు. ఆరోపణలపై విచారణ చేస్తామన్నారు.
ప్రజల డబ్బుతో జరిగే పన్నుల్లో గోప్యత ఉండదని తెలిపారు. పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశించానని.. నీటిపారుదల శాఖది కీలక పాత్ర అని పేర్కొన్నారు. ఎవ్వరు డిజైన్ చేసినా.. ఎవ్వరు నిర్మాణం చేసినా బాధ్యులను చెయ్యాల్సి ఉంటుందన్నారు. కొత్త ఆయకట్టు వివరాలు ఇవ్వమని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. కోట్లాది ప్రజలు విశ్వాసంతో ముడిపడి ఉన్న అంశం.. అంతా పారదర్శకంగా ఉంటుందన్నారు. తుమ్మడిహట్టి ప్రాజెక్ట్ నిర్మాణం గురించి ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎస్ఎల్బిసీ ప్రాజెక్ట్ పనులు పూర్తి చేసేందుకు ఎంత అవసరమైనా ఖర్చు చేసేందుకు ముఖ్యమంత్రితో చర్చించి.. మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.