రేషన్‌ కార్డుదారులకు శుభవార్త.. త్వరలోనే సన్నబియ్యం పంపిణీ

రాష్ట్రంలోని పేదలకు ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. తెల్ల రేషన్‌ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సన్న బియ్యం పంపిణీ చేస్తామని తెలిపింది.

By అంజి  Published on  17 Sept 2024 6:26 AM IST
Minister Uttam Kumar, thin rice, ration card holders, Telangana

రేషన్‌ కార్డుదారులకు శుభవార్త.. త్వరలోనే సన్నబియ్యం పంపిణీ

హైదరాబాద్‌: రాష్ట్రంలోని పేదలకు ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. తెల్ల రేషన్‌ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సన్న బియ్యం పంపిణీ చేస్తామని తెలిపింది. అటు కొత్త రేషన్‌ కార్డుల విధివిధానాలపై మరోసారి సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు. జనవరి నుంచి రేషన్‌ కార్డుదారులకు సన్న బియ్యం ఇవ్వనున్నట్టు వెల్లడించారు. గత ప్రభుత్వం హయాంలో 49,476 రేషన్‌ కార్డులు మాత్రమే ఇచ్చిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ తెలిపారు. ఉప ఎన్నిక ఉన్న నియోజకవర్గాల్లోనే ఆ కార్డులు ఇచ్చిందన్నారు.

పేదలకు సన్న బియ్యం అందిస్తామనే హామీ మేరకు కాంగ్రెస్‌ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 30.50 లక్షల రేషన్‌ కార్డులు ఉన్నట్టు తెలిపారు. వీరికి ఆరు కిలోల ఉచిత బియ్యం అందించనున్నారు. ఈ నెల 21వ తేదీన కేబినెట్‌ సబ్‌ కమిటీ మరోసారి సమావేశం కానుంది. ఈ సమావేశంలో తెల్ల రేషన్‌ కార్డుల మంజూరుకు విధివిధానాలు వెల్లడిస్తామని తెలిపారు. తెల్ల రేషన్‌ కార్డులతో హెల్త్‌ కార్డులు కూడా మంజూరు చేయనున్నట్టు మంత్రులు పేర్కొన్నారు.

Next Story