తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. శుక్రవారం నాడు హుజూర్‌నగర్ నుంచి జాన్‌పహాడ్ ఉర్సు ఉత్సవాలకు వెళ్తుండగా గరిడేపల్లి వద్ద పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు నిలబడి ఉండటం చూసి ఉత్తమ్ తన కారును ఆపమన్నారు. దీంతో డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశాడు. వెనకాలే వస్తున్న 8 కార్లు ఒకదానికొకటి ఢీకొని దెబ్బతిన్నాయి. ప్రమాదం నుంచి ఉత్తమ్ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. కార్యకర్తలకు అభివాదం చేసిన ఉత్తమ్ కుమార్.. ఉర్సు ఉత్సవాలకు బయల్దేరి వెళ్లారు. అనంతరం పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.